బ్లప్ మాస్టర్ సినిమా స్టైల్లో 60లక్షల దోపిడీ...24 గంటల్లో ఛేదించిన పోలీసులు

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ ( Miryalaguda )పట్టణంలో ఈ నెల 5 న బ్లాప్ మాస్టర్ సినిమా స్టైల్లో జరిగిన ఓ దోపిడీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించి,దోపిడికి గురైన మొత్తం సొమ్మును రివకరీ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్( SP Sarath Chandra Pawar ) మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.పట్టణంలో సంచలనం కలిగించిన భారీ నేరాన్ని మిర్యాలగూడ డీస్పీ కె.

 60 Lakh Robbery In The Style Of Blup Master Movie...police Busted It In 24 Hours-TeluguStop.com

రాజశేఖర్ రాజు నేతృత్వంలో 24 గంటల్లో ఛేదించిన మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్,ఎస్ఐ శేఖర్ వారి సిబ్బంది, మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున,వారికి సహరించిన ఎస్ఐ మిర్యాలగూడ రూరల్ ను జిల్లా ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు.ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం… హైదరాబాద్ కు చెందిన సమీర్ నిజామాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు.

వ్యాపార అవసరాల నిమిత్తం రూ.5 కోట్లు అప్పుగా కావాలని శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కండెల గణేష్@ ప్రవీణ్,మల్లికార్జున్ లను సంప్రదించగా నిందితులు రూ.5 కోట్ల అప్పుగా ఇవ్వడానికి ఒప్పందం చేసుకొన్నారు.పథకం ప్రకారం సమీర్ కు మొదట రూ.90 లక్షల అప్పుగా ఇచ్చారు.ఆ తరువాత బాధితుడు సమీర్ రూ.5 కోట్ల గురించి గణేష్, మల్లిఖార్జున్ లను సంప్రదించగా ఈ నెల 5నతాము మొదటగా ఇచ్చిన రూ.90 లక్షలు తీసుకొని వాటితో పాటుగా తాము ఇవ్వబోయే రూ.5 కోట్ల అప్పుకు వడ్డీగా రూ.60 లక్షల తీసుకొని మిర్యాలగూడ రమ్మని చెప్పగా,సమీర్ తన వ్యాపార భాగస్వాములతో కలిసి ఆగష్టు 5సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ గాంధీనగర్ లో గల వీరన్న ఇంటికి రూ.90 లక్షలు,ఇవ్వబోయే రూ.5 కోట్ల వడ్డీ రూ.60 లక్షలు వేర్వేరుగా మొత్తం.రూ.1కోటి 50 లక్షలు తీసుకొని వచ్చారు.అప్పటికే పథకం ప్రకారం వీరన్న ఇంటి వద్ద గణేష్,మల్లిఖార్జున్, విజయ్,రాజు,గంగమ్మ, అనుపమ,వెంకటమ్మ,వీరమ్మ వేచి చూస్తున్నారు.

ముందుగా సమీర్ వద్ద రూ.90 లక్షలు తీసుకొని,వారి వద్దనున్న చెక్కులు,ప్రాంసరీ నోట్లు, ఇంటి కాగితాలు సమీర్ కు తిరిగిచ్చారు.తర్వాత సమీర్ తనకు అప్పుగా ఇస్తానన్న రూ.5 కోట్ల గురించి అడగగా ఇస్తాం ముందు రూ.5 కోట్లకు వడ్డీగా తెచ్చిన రూ.60 లక్షలు చూపించమని కోరారు.సమీర్ వడ్డీగా తెచ్చిన రూ.60 లక్షలు తీసి చూపెడుతుండగా హఠాత్తుగా కండేల గణేష్, మల్లికార్జున్,విజయ్,రాజు మిగతా వారితో కలిసి వారిపై దాడి చేసి,కొట్టి రూ.60 లక్షలు గల బ్యాగు లాక్కొని పరారయ్యారు.వెంటనే తేరుకుని సమీర్ నిందితులను వెంబడించే ప్రయత్నం చేయగా బయట కాపుకాస్తున్న గంగమ్మ,అనుపమ,వీరమ్మ,వెంకటమ్మ సమీర్ పై రాళ్లతో దాడి చేసి తర్వాత వాళ్ళు కూడా పారిపోయారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐ శేఖర్ తమ సిబ్బందితో తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని నేరస్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.ఆ వెంటనే మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున, సిబ్బంది,మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ,సిబ్బంది సహకారంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరస్థలంను,చుట్టుపక్కల సోదాలు నిర్వహించారు.అనుపమ,వీరమ్మ,గంగమ్మ దోచుకున్న రూ.60 లక్షల తో పరారీలో ఉండగా నమ్మదగిన సమాచారంపై మిర్యాలగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్,ఎస్ఐ శేఖర్,సిబ్బంది,మిగతా అధికారుల సహకారంతోబుధవారం ఉదయం 10:30 గంటలకు అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుండి రూ.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.పరారిలో ఉన్న ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube