నల్లగొండ కేసీఆర్ బహిరంగ సభకు లైన్‌ క్లియర్‌...!

నల్లగొండ జిల్లా:ఈనెల 13వ తేదీన నల్లగొండలో( Nalgonda ) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతి ఇచ్చారు.కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 The Line Is Clear For Kcr's Open Meeting In Nalgonda , Nalgonda, Kcr , Mla Kanc-TeluguStop.com

అందులో భాగాంగా సభకు అనుమతి కోరుతూ బుధవారం జిల్లా ఎస్పీ చందన దీప్తిని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్,నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి( MLA Kancharla Bhupal Reddy ),సభ సమన్వయకర్త రవీంద్ర సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్, మందడి సైదిరెడ్డి,మాజీ ఆర్వో మాలే శరణ్యరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు,మెరుగు గోపి,సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube