KC Venugopal : విదేశాల్లో భారతీయ విద్యార్ధుల మరణాలు .. ‘‘ విద్వేష నేరం ’’ కోణంపై విచారణ జరపండి : కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్ధులు( Indian Students ) రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతూ వుండటం ఇరుదేశాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.ఈ ఘటనల నేపథ్యంలో భారత్‌లో వున్న విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

 Congress Mp Kc Venugopal Asks Government To Probe Hate Crime Behind Indian Stud-TeluguStop.com

ఈ క్రమంలో భారత్‌లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్( MP KC Venugopal ) స్పందించారు.మంగళవారం రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ.

విద్యార్ధుల మరణాల వెనుక ఏదైనా ‘‘ ద్వేషపూరిత నేరం ’’( Hate Crime ) కోణం వుంటే తక్షణం దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా వేణుగోపాల్ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.లోక్‌సభలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( Dr S Jaishankar ) పంచుకున్న వివరాలను ఉటంకిస్తూ మాట్లాడారు.2018 నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారని వేణుగోపాల్ పేర్కొన్నారు.ఇది కేవలం సంఖ్య కాదని, దీని వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయని, యువత కలలు చెదిరిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.91 ఘటనలతో కెనడా( Canada ) అగ్రస్థానంలో వుండగా.48 కేసులతో యునైటెడ్ కింగ్‌డమ్( UK ) రెండవ స్థానంలో వుందని వేణుగోపాల్ పేర్కొన్నారు.

-Telugu NRI

ఒక్క అమెరికాలోనే( America ) ఈ ఏడాది జనవరిలో నలుగురు భారతీయ , భారతీయ సంతతి విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్ధుల భద్రతను నిర్ధారించాల్సిందిగా ఈ సంఖ్య హెచ్చరిస్తోందని కేసీ వేణుగోపాల్ తెలిపారు.ఈ కేసుల్లో విద్వేష కోణం వుందా లేదా అనే దానిని మనం తప్పక తెలుసుకోవాలన్నారు.

ప్రతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని.ఈ హింస పెరగడానికి గల కారణాలను పరిష్కరించడం చాలా అవసరమని వేణుగోపాల్ పేర్కొన్నారు.

-Telugu NRI

ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యుల బాధను విస్మరించలేమని.మన విద్యార్ధులు సురక్షితమైన వాతావరణంలో నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత మనపై వుందని కాంగ్రెస్ ఎంపీ సూచించారు.భారతీయ విద్యార్ధులు చదువుతున్న దేశాలతో ప్రభుత్వం దౌత్యపరంగా దృఢమైన ప్రయత్నాలలో పాల్గొనాలని కేసీ వేణుగోపాల్ అన్నారు.అంతేకాదు.విదేశాలలో భారతీయ విద్యార్ధులకు సంబంధించిన సంఘటనలను ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి, నివేదించడానికి సమగ్ర రికార్డుల వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ఆయన కేసు కూడా పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube