నల్లగొండ జిల్లా:18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి చెప్పారని,అందుకే మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టిని డిస్ క్వాలిఫై చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు టీఆర్ఎస్ బృందం ఫిర్యాదు చేసింది.ఆదివారం ఎస్ఆర్ నగర్ లోని ఎన్నికల అధికారి నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చరని స్వయంగా చెప్పాడని,అందుకు రాజగోపాల్ రెడ్డిని పోటీగా అనర్హుడిగా ప్రకటించాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజకీయ విలువలకు తూట్లు పొడిచే వారిని ప్రోత్సాహించద్దని ఎన్నికల అధికారికి వివరించామన్నారు.ఈటెల రాజేందర్ కి,వివేక్ కి కూడా వాటా ఇస్తామని చెప్పాడట,రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాన్ని మోడీ,అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి వారికి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇవ్వాలని ఘాటుగా విమర్శించారు.ప్రజల కోసం ఏనాడు పని చేయలేదని,పైసల అహంకారంతో మాట్లాడుతున్నాడని ఆరోపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు కృత్తిమ ఎన్నిక తెచ్చారని,రాజగోపాల్ రెడ్టి,బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొడతారని, మునుగొడులో ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ టీఆర్ఎస్ బృందంలో పార్టీ జనరల్ సెక్రెటరీలు శ్రీనివాస్ రెడ్డి,సోమ భరత్,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.