పొగబాంబుల విసిరివేత సమస్యలకు పరిష్కారం కాదు: సీపీఐ(ఎంఎల్) సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్

నల్లగొండ జిల్లా:లోక్ సభలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదం లేని పొగ సెల్సుతో ప్రవేశించడం భద్రతా వైఫల్యంతో పాటు, వారు చేసిన నినాదాలు రాజ్యాంగాన్ని రక్షించండి, నిరంకుశత్వం, నియంతృత్వం నశించాలనే నినాదాలు, జైభీమ్ అనే నినాదాలు వారి మానసిక ఆవేదనను తెలియజేస్తున్నాయని సిపిఐ(ఎంఎల్)సెక్రటరీ ( CPI(ML) Secretary )కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ( Subhash Chandra Bose )రెడ్ సన్ నేతాజీ రాజన్న జెఎస్ఆర్ ఆన్నారు.ఇటువంటి చర్యలు వారి మిలిటెంట్ ఉగ్రవాద చర్యని,ఇది సరైన విధానం కాదని ఖండించారు.

 Throwing Smoke Bombs Is Not A Solution To Problems: Cpi(ml) Secretary Comrade Js-TeluguStop.com

భద్రతా వైఫల్యంపై తగు విచారణ జరిపి తగు భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే భారత పార్లమెంటు 370 ఆర్టికల్ రద్దుతో సహా,బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల ప్రవచిత మనువాద,ఫాసిస్టు చట్టాలను యధేచ్చగా అమలు చేసుకుంటూ పోతున్నదని బహుజన శ్రామికవర్గ ఉద్యమకారుడు కామ్రేడ్ జేఎస్ఆర్ ఆరోపించారు.

370 ఆర్టికల్ రద్దుపై, కాశ్మీర్ ను రెండు ముక్కలుగా విడగొట్టిన తీర్పుపై చివరి ఆశగా వున్న ఉన్నత న్యాయస్థానం సైతం ప్రజాస్వామిక,ఫెడరల్ విలువలను గుర్తించలేక పోయిందనే ఆవేదన ప్రజాస్వామిక వాదుల నుండి వ్యక్తం అవుతున్నదని పేర్కొన్నారు.బీజేపీ ప్రభుత్వం ఉపా లాంటి రాజద్రోహ చట్టాలు మోపి ప్రతిపక్ష,ప్రజాస్వామ్య, మైనార్టీ గొంతు లేకుండా చేసే యత్నాలు సమాజంలో అసహనాన్ని పెంచుతున్నాయని తెలిపారు.

భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగం రాబోతుందన్న ఆందోళన నుంచి ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని,భగత్ సింగ్,భటుకేశ్వర దత్తు బ్రిటీష్ నల్ల చట్టాలకు వ్యతిరేకంగానే పార్లమెంటులో ప్రమాదరహిత పొగ బాంబులు వేశారని,నేడు అదే పద్ధతి కన్పిస్తున్నదని కామ్రేడ్ జేఎస్ఆర్( Comrade JSR ) 9848540078 తెలిపారు.ఏది ఏమైనా ఇలాంటి చర్యలు ఫాసిస్టు పాలకులకు మరిన్ని కోరలు పెరగడానికి తొడ్పడతాయన్నారు.

ఇలాంటి టెర్రరిస్టు పద్ధతులు సరికావని, ప్రజల,ప్రజాస్వామిక, లౌకికవాదుల,మతోన్మాద వ్యతిరేకుల ప్రజాసమీకరణ,ప్రజా ఉద్యమం ద్వారానే పాలకుల ఫాసిస్టు, దురహంకార,దుర్నితీకర చట్టాలను,పద్ధతులను ఓడించగలుగుతారని, పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలను చైతన్యం చేయడం ద్వారా,ప్రజల ప్రతిఘటన శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఓడించగలుగుతామని, వ్యక్తిగత హింస వాదానికి తావు లేకుండా వ్యవస్థ మార్పు కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని సూచించారు.నూతన ప్రజాస్వామ్య విప్లవ పోరాటాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడం ద్వారా మాత్రమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయగలుగుతామన్నారు.

యువతరం కమ్యూనిజన్ని చదవాలని,సమసమాజ స్థాపనలో జరుగుతున్న ప్రజా పోరాటాలలో భాగస్వాములు కావాలని బలహీనవర్గాల బంధువు, పేద వర్గాల పెన్నిధి భారత కమ్యూనిస్టు పార్టీ(ఎంఎల్) సెక్రటరీ,ప్రజా బంధువు అవార్డు గ్రహీత,కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 8328277285 నేడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube