ఆలేరులో భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యం పట్టివేత

యాదాద్రి జిల్లా:జిల్లాలో పిడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.జిల్లా నుండి బియ్యం అక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయని మీడియాలో అనేక కథనాలు వచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కుల పాలిట వరంగా మారింది.

 Seizure Of Large Quantities Of Pds Rice In Aleru-TeluguStop.com

ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఆలేరులోని రఘనాథపురం రోడ్డు వద్ద వేల క్వింటాల పీడీఎస్ బియ్యం భారీ డంపు చేసి,ట్రాక్టర్,టాటా ఏసీజీల ద్వారా తరలిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీస్లకు అప్పగించారు.ఇంత పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం దొరకడం ఇదే మొదటి సారని తెలుస్తోంది.

మరికొన్ని ట్రాక్టర్ల ద్వారా వందల క్వింటాల బియ్యం వేరే ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube