నల్లగొండ జిల్లా:2009లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల కోసం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో రెండు చోట్ల సేకరించిన 12.43 గుంటల భూమిని వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పేదలతో కలిసి ఇండ్ల స్థలాన్ని పరిశీలించి అనంతరం స్థానిక తహసీల్దార్ బక్క శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కమిటీ సభ్యులు రామలింగచారి,యాదగిరి రెడ్డి,సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.




Latest Nalgonda News