నల్లగొండ జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల( Private, corporate schools )లో అడ్మిషన్స్ దాదాపు పూర్తయ్యాయి.స్టూడెంట్స్ క్లాస్ రూముల్లో సెటిలయ్యారు.
అడ్మిషన్ ఫీజుల చెల్లింపులు కూడా ముగిశాయి.ఇక మిగిలింది అసలైన విద్యా వ్యాపారం స్టేషనరీ బుక్స్ కొనుగోలు ప్రక్రియ.
ఇక్కడే ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థల యాజమాన్యానికి కొత్త తలనొప్పులు వచ్చాయి.గతంలో ఈ వ్యాపారం జోరుగా సాగేది,కానీ,ఈ విద్యా సంవత్సరంలో విద్యార్ది,ప్రజా సంఘాలు ప్రారంభం నుండే విద్యా వ్యాపారంపై ఆందోళన చేపట్టడంతో చేసేదేమీలేక స్కూల్స్ లో వ్యాపారం బంద్ పెట్టారు.
కానీ,తిరిగే కాలు రోటీ కింద పెట్టినా ఆగదన్నట్లుగా వ్యారానికి అలవాటుపడిన ప్రైవేట్ సంస్థలు నల్లగొండ జిల్లాలో సరికొత్త దందాకు తెరలేపాయి.ఈసారి ప్రభుత్వం నుండి స్కూల్స్ స్టేషనరీ విక్రయాలు జరపొద్దని సిరియస్ ఆదేశాలు జారీ చేయడంతో చేసేది లేక రూట్ మార్చారు.
బుక్ షాపులతో సిండికేట్ గా మారి వారి స్కూల్ కు చెందిన అన్ని రకాల స్టేషనరీ అందులోనే కొనుగోలు చేయాలని పేరెంట్స్ పై వత్తిడి తెస్తున్నారు.ఈ సిండికేట్ షాపుల్లో ఎమ్మార్పీ ధరలకు కాకుండా స్కూల్స్ యాజమాన్యం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తూ పేరెంట్స్ ను నిలువు దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపైపేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దందా చాలా పద్ధతి ప్రకారం సాగుతోంది.
స్కూల్( School ), తరగతిని బట్టి దుకాణం యజమాని బుక్స్ ను బండిల్స్ గా కట్టి ఉంచుతారు.
పేరెంట్స్ రాగానే స్కూలు,తరగతి అడగడం దుకాణాల్లో పనిచేస్తున్న గుమస్తా ఓ బుక్స్ బండిల్,బిల్ తెచ్చి చేతిలో పెట్టడం చకచకా జరుతుంది.దుకాణం యజమానితో పేరెంట్స్ బేరమాడటం తగ్గించడం డిస్కౌంట్ ఇలాంటి మాటలేవి ఉండవు.
సైలెంట్ గా దుకాణం యజమాని చేతిలో పెట్టిన బిల్లు చెల్లించి అతికష్టం మీద బరువైన బుక్స్ మోసుకుంటూ వెళ్లాల్సిందే.స్కూల్ యాజమాన్యం ఆదేశించిన బుక్స్ మాత్రమే కొనాలి, అది కూడా వాళ్ళు చెప్పిన దుకాణాల్లోని కొనుగోలు చేయాలి.
ఇక్కడ ప్రభుత్వం,విద్యావేత్తలు సూచించిన ప్రమాణాలు ఏవీ పని చేయవు.స్కూల్ యాజమాన్యం ఇచ్చే ఆమ్యామ్యాలకు అలవాటుపడిన విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరన్న విమర్శలు లేకపోలేదు.
ఎల్కేజీ,యూకేజీ బుక్స్ 3 వేల నుంచి 5 వేల బిల్లు అవుతోంది.స్కూల్ ఫీజులు చెల్లించడం ఒక ఎత్తైతే బుక్స్,స్టేషనరీ,యూనిఫాం బస్ ఛార్జీలు తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారింది.
ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు అధికంగా ఉన్నాయని,బుక్స్ అధిక ధరలకు అమ్మడాన్ని ప్రజాప్రతినిధులు,వివిధ ప్రజా సంఘాల,విద్యార్థి సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు.జిల్లాలో చదువు అత్యంత ఖరీదై పోయిందని పేరెంట్స్ వాపోతున్నారు.
సేవా దృక్పథంతో సాగాల్సిన విద్య ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలల వైఖరితో వ్యాపారంగా మారిందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.