నల్లగొండ జిల్లా:మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని మత సామరస్యం వెల్లివిరిసేలా శనివారం మునుగోడు( Munugode ) పట్టణ కేంద్రంలోఅయ్యప్ప భక్తులకు( Ayyappa devotees ) ఓ ముస్లిం యువకుడు( Muslim youth ) అన్నదానం చేసి ఔరా అనిపించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ కులమత బేధాలు లేకుండా మనుషులంతా కలిసి మెలిసి ఉండాలని కోరారు.
ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఎంతో తృప్తినిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అల్లావుద్దీన్,యం.
డి గౌస్ ఉమర్,కొంపల్లి,చీకటి మామిడి సర్పంచ్ లు జాల వెంకన్న,తాటికొండ సైదులు,చెరుకుపల్లి వెంకన్న,అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.