వైఆర్ పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సాంబశివుడి వర్ధంతి...!

నల్లగొండ జిల్లా:పేదల పెన్నిధి,ఉద్యమ వీరుడు, మాజీ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి,టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కోనపురి సాంబశివుడి 12వ వర్ధంతి వేడుకలను యాదవ రాజ్యాధికార పోరాట సమితి (వైఆర్ పిఎస్) రాష్ట్ర అధ్యక్షులు చల్లాకోటేష్ యాదవ్, రాష్ట్ర సలహాదారులు బెల్లి నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మేకల యాదన్న యాదవ్, యాదవ సంఘం సీనియర్ నాయకులు అల్లి సుభాష్ యాదవ్,మామిడి పద్మ, గుండెబోయిన జానయ్య, కన్నేబోయిన అంజిబాబు, గంగుల చందువంశీ, కంబాలపల్లి ఉపేందర్ యాదవ్ పాల్గొని సాంబశివుడి చిత్ర పటానికిపూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 Sambashivu's Death Was Solemnized Under Yrps...!-TeluguStop.com

ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ సాంబశివుడు అజ్ఞాతంలో ఉండి పేద ప్రజల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని,జనజీవనంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేస్తున్న క్రమంలో అమరులు కావటం జరిగిందని అన్నారు.రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి సాంబశివుడు మరియు అతని సోదరుడు రాములు కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.

ఉమ్మడి నలగొండ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ సంస్థకు సాంబశివుడు పేరు పెట్టాలని,కోనపురి స్వర్ణలతకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని,కోనపురి కవిత రాములుకి మార్కెట్ చైర్మన్ పదవిని రెన్యువల్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.ఈ కార్యక్రమంలో సాగర్ల నరేష్,నల్లబెట్టి పురుషోత్తం,మిర్యాల సైదులు,సుంకరబోయిన శివ,వినయ్,వల్లాల వంశీ, జాల చక్రపాణి, గుండబోయిన మల్లేష్, రఘు,వర్రె నరసింహ, తెల్సురి శంకర్,బత్తుల తిరుపతి,మేక శ్రీధర్ రెడ్డి, హరిబాబు,బొల్లం లింగయ్య,కొట్టె శంకర్, నరేష్,సందీప్ తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube