Nalgonda : హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్…!

కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామం( Ippalagudem )లో ఈ నెల 3న జరిగిన వంటల సైదులు హత్య కేసులో నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.నల్లగొండ డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంటల సైదులు తండ్రి జానయ్యను ఈ నెల 03 న కొందరు వ్యక్తులు హత్య చేశారని మృతుని కొడుకు చందు కేతపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

 Three Members Arrested In Murder Case-TeluguStop.com

అతని ఫిర్యాదు మేరకు క్రైమ్ నం: 15/2024 U/s 302 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయగా హత్యకు పాల్పడిన వారిని గుర్తించడం జరిగింది.ఇప్పలపాడు గ్రామానికి చెందిన మోదాల శ్రవణ్ కుమార్( Modala Sravan Kumar ) కు అదే గ్రామానికి చెందిన వంటల సైదులు (మృతుడు) వ్యవసాయకూలి పనులకు వెళ్ళేవాడు.

పనిచేసే సమయంలో శ్రవణ్ భార్యతో సైదులు చనువుగా ఉండేవాడు.దీనితో శ్రవణ్ తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నడని అనుమానం కలిగి,అతనిపై కోపం పెంచుకొని,జరిగిన విషయాన్ని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన సొంత బామ్మర్ది బండారి వెంకటేశ్వర్లు@ వెంకటేష్ కు చెప్పి,ఎలాగైనా సైదులును చంపాలని చెప్పగా అందుకు బామ్మర్ది ఒప్పుకున్నాడు.2024 ఫిబ్రవరి 2 న మోదాల శ్రవణ్ కుమార్,తన బామ్మర్ది వెంకటేష్ కలిసి సైదులును చంపుటకు ఒక పథకం వేసుకొని అతని కదలికలు తెలుసుకొనుటకు అదే గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటేష్ బాబాయి కొడుకు బండారి సాయి@ సాయి కుమార్ ను కలిసి మృతుణ్ణి చంపే పథకం చెప్పి అందుకు తన సహాయం కావాలని అడగగా అందుకు సాయి కుమార్ కూడా ఒప్పుకున్నాడు.
అందరూ కలిసి ఊర్లో శ్రవణ్ కుమార్ యొక్క వ్యవసాయభూమి వద్ద మందు,బీర్లు తాగి, తమ పథకంలో బాగంగా సైదులు చంపుటకు వ్యవసాయ పొలం వద్ద పొలం పనిముట్లకు వాడే ఇనుపు సుత్తెను తమ బండిలో పెట్టుకున్నారు.రాత్రి 7.30 గంటల సమయంలో మృతుడు ఊర్లో బెల్ట్ షాప్ వద్ద మందు తాగుతుండగా వెంకటేష్,సాయి ఇద్దరు అక్కడికి వెళ్ళి మృతినితో కలిసి,మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుంటూ మందు తాగుదామని నమ్మబలికి అక్కడ నుండి మృతుణ్ణి తమ వెంట ఇప్పలగూడెం గ్రామ శివారులోని ఐకేపి సెంటర్ వద్ద తీసుక వెళ్ళినారు.ఇంతలో శ్రవణ్ కుమార్ కూడా తన వ్యవసాయ భూమి వద్ద నుండి అక్కడికి రాగా అక్కడ అందరూ కలిసి తమ వెంట తీసుకోవెళ్లిన మందు,బీర్లు తాగినారు.ఇంతలో మృతుణ్ణి ఎందుకు తన భార్య వెంట పడుతున్నావని శ్రవణ్ కుమార్ అడగగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి శ్రవణ్ కుమార్,వెంకటేష్ తమతో పాటు తెచ్చుకున్న సుత్తెతో కుడి కన్ను పక్కన,కుడి చెవి,మెడపై,ఛాతిపై,కుడి కణతపై ఎడమ కాలు తొంటిపై బలంగా కొట్టి హత్య చేశారు.

మృతుణ్ణి చంపేటప్పుడు సాయి కుమార్ రోడ్డుపై కాపలాగా ఉన్నాడు.ముగ్గురినీ అరెస్ట్ చేసి,హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించారు.ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన శాలిగౌరారం సిఐ ఎస్.రాఘవరావు,కేతేపల్లి ఎస్ఐ శివతేజ,సిబ్బంది మహేష్,అజిత్ రెడ్డిని డిఎస్పీ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube