నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం భాషనుభావి తండాలో కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతి చెందాయి.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం దొడ్డిలో గొర్రెల మందను తోలి ఇంటికి వెళ్లగా రాత్రి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి ఆరు గొర్రెలను విపరీతంగా కరిచి చంపాయని బాధిత కుటుంబం కన్నీరు మున్నీరయ్యారు.
విషయం తెలుసుకున్న మండల పశు వైద్యాధికారి డాక్టర్ చంద్రబాబు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు.
చనిపోయిన గొర్రెల 1,20,000 ఉంటుందని, కష్టపడి తిండి తినక గొర్ల మందను పెంచుకుంటున్నామని, ప్రభుత్వం సహాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు.
అధికారులు స్పందించి గ్రామాలలో స్వైర విహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కలను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు.