రాజమౌళి వర్సెస్ ప్రశాంత్ నీల్ : “రాజమౌళికి దెబ్బేసేలా ప్రశాంత్ నీల్ టేకింగ్”… ముందు ముందు కష్టమే?

సినిమా అనేది వినోదం నుండి ఇప్పుడు ప్రదహన బిజినెస్ వనరుగా మారిపోయింది.దాదాపు ప్రతి ఒక్కరూ సినిమా పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నారు అందుకు అనుగుణంగానే మన డైరెక్టర్ లు సైతం మన ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలలకు విస్తరింప చేస్తున్నారు.

 Rajamouli Vs Prashanth Neel , Rajamouli, Prashanth Neel, Indian Cinema, Jakkanna-TeluguStop.com

అయితే ఒకప్పుడు ఒకేరకమైన సినిమాలు వస్తూ ఉండేవి.ప్రేక్షకులు కూడా ఈ తరహా సినిమాలు చూస్తూ విసిగిపోయారు.

అప్పుడే నవశకం మొదలైంది ఎస్ ఎస్ రాజమౌళి అనే ఒక దర్శకుడు తన సినిమాలలో కొత్తదనం చూపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ముఖ్యంగా మగధీర, బాహుబలి సిరీస్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు రాజమౌళిని ప్రపంచంలో ప్రమయూఖ దర్శకుడిగా నిలబెట్టాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో అపజయం ఎరుగని టాప్ డైరెక్టర్ గా మరియు ఇండియాలో టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

జక్కన్నతో కలిసి పని చేయడానికి అన్ని సినిమా పరిశ్రమల నటీనటులు పోటీ పడుతున్నారు అంటే నమ్మండి.

గత నెలల్లో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి తెలుగు సినిమా పవర్ ఏమిటో చూపించింది అని చెప్పాలి.అయితే ఇతనితో పోటీ పడే డైరెక్టర్ ఎవరూ ఉండరు? ఇక రాబోరు అని అంతా డిసైడ్ అయిపోయారు.అయితే ఇప్పుడు ఒకడు వచ్చాడు అని తన ఆగమనాన్ని బలంగా చాటాడు.అతనే ఎవరో కాదు కన్నడలో ఉగ్రం అనే సినిమాతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన ప్రశాంత్ నీల్.

మొదటి సింఎంతోనే సక్సెస్ కొట్టి శాండల్ వుడ్ లో సెన్సేషన్ అయ్యాడు.ఇక ఆ తర్వాత తీసిన సినిమాతో తన దశ తిరిగిపోతుందని బహుశా ప్రశాంత్ నీల్ కూడా ఊహించి ఉండడు.

కన్నడ స్టార్ యశ్ తో తీసిన కేజిఎఫ్ చాప్టర్ 1 మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ స్థాయిలో వసూళ్లను సాధించింది.

Telugu Prabhas, Indian, Jakkanna, Prashanth Neeel, Rajamouli, Salar, Tollywood-T

ఈ సినిమా ఇచ్చిన మాస్ విజయంతో ఇతని పేరు లైం లైట్ లోకి వచ్చింది.అయితే అప్పుడే ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని ప్రకటించి ప్రశాంత్ నీల్ పేరు ఎప్పుడూ వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తో సందడి చేస్తోంది.

ఈ రెండు పార్ట్ లలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా తీసి అందరి దృష్టిలో పడ్డాడు.రాజమౌళి లాగానే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా చేరిపోయాడు.

అయితే ఇప్పుడు ఇద్దరూ కూడా తమ మేకింగ్ లో ప్రత్యేకతను చూపిస్తూ ఒకరికి ఒకరు పోటీగా మారుతున్నారు.ముఖ్యంగా రాజమౌళి ప్రశాంత్ నీల్ లలో కనిపించే స్ట్రాంగ్ పాయింట్ ఒక్కటే.

హీరో ఎలివేషన్ మరియు సెంటిమెంట్ లను అద్భుతంగా తెరకెక్కిస్తారు.

కానీ ఇప్పుడు రాజమౌళి కన్నా ప్రశాంత్ నీల్ ఒక మెట్టు పైనే ఉన్నాడు.

రాజమౌళి ఇంతటి పేరును సంపాదించుకోవడానికి 12 సినిమాల వరకు పడితే, కానీ ప్రశాంత్ నీల్ మాత్రం కేవలం మూడు సినిమాలకే ఇండియన్ సినిమాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి టాప్ హీరోలు అంతా పోటీ పడుతున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ తో సలార్ తీస్తున్నాడు.ఇక తర్వాత వరుసలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.

ఇవన్నీ చూస్తే రాజమౌళికి ప్రశాంత్ నీల్ పోటీగా రానున్నాడు.మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube