నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి( Revanth Reddy)కి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ వి.శ్రీనివాసరావు (విఎస్ఆర్ ) ( Srinivasa Rao )నియమితులయ్యారు.
ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.గత 20 యేళ్లుగా జర్నలిస్టు వృత్తిలో ఉన్న శ్రీనివాస్ ఈటీవీ,మహా న్యూస్,బిగ్ టీవీతో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో రిపోర్టర్ గా,ప్రజెంటర్ గా పని చేశారు.
శ్రీనివాస్ స్వస్థలం నల్గొండ జిల్లా( Nalgonda District ) మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామం కావడంతో ఆయన ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు