నల్లగొండ జిల్లా:హాలియా మండలం( Haliya ) వెంకటాపురంలో మంగళవారం తెల్లవారుజామున జరగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం చెందారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం( Aregudem )కు చెందిన మధు అనే కానిస్టేబుల్న ల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (ఎస్పీఎఫ్) గా పని చేస్తున్నాడు.
మధు( Madhu ) మోటార్ సైకిల్‌పై నల్లగొండ వెళ్తుండగా అతడి బైక్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మధు మృతితో ఆరెగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి







