హెచఐవీకి అవగాహనే మందు...నియంత్రణకు కృషి చేద్దాం:కలెక్టర్

నల్లగొండ జిల్లా: హెచ్ఐవి కేసులను తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.

 Awareness Is The Cure For Hiv Lets Work For Control Collector C Narayana Reddy,-TeluguStop.com

ప్రత్యేకించి కేసులు ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని తెలిపారు.శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన చికిత్స కోసం ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించిన “సంచార సమీకృత హెచ్ఐవి పరీక్ష వాహనాన్ని” పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు,వాహన సౌకర్యం లేని ప్రాంతాలలో హెచ్ఐవి కేసుల గుర్తింపు, బాధితులకు చికిత్స అందించేందుకు ఈ వాహనం బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

అలాగే ప్రజలు హెచ్ఐవి బారిన పడకుండా కౌన్సిలింగ్ చేయడం,అవగాహన తీసుకువచ్చేందుకు గ్రామీణ ప్రాంతాలకు ఒక మంచి అవకాశమని,ఈ వాహనం ద్వారా ఎయిడ్స్ పై అవగాహనతో పాటు, చికిత్స,అలాగే కౌన్సిలింగ్, రక్త పరీక్షలు వంటివి నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఎక్కడైనా పాజిటివ్ కేసులు వస్తే చికిత్స అందించడానికి అవకాశం ఉందని,ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎయిడ్స్ పాజిటివ్ సోకినట్లయితే ముందే గుర్తించి చికిత్స అందిస్తే బిడ్డకు నెగటివ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కాగా ఈ సంచార సమీకృత హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్ష వాహనాన్ని రాష్ట్రంలోని 10 జిల్లాలకు కేటాయించగా,అందులో నల్గొండ జిల్లా ఒకటని, దీనిని దృష్టిలో ఉంచుకొని హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ కేసులు తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్,ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వేణుగోపాల్ రెడ్డి,డాక్టర్ అరుంధతి,జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జిల్లా ఎయిడ్స్ ప్రాజెక్టు మేనేజర్ సుధాకర్, సూపర్వైజర్ సంపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube