నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.ఎగ్జిట్ పోల్స్‌లో కూడా స్పష్టత రాకపోవడంతో ఈ ఫీవర్ ఏపీ,కర్ణాటకకు సైతం తాకి బెట్టింగ్ జోరందుకున్నది.
నియోజకవర్గాలు, అభ్యర్థుల వారీగా భారీగా పందాలు కాస్తున్నట్టు తెలుస్తున్నది.చాలామంది ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్,కాంగ్రెస్ పార్టీల గెలుపు,వ్యూహరచనపై నమ్మకం పెట్టుకున్నట్టు సమాచారం.ఒక్కో బెట్టింగ్ రూ.10 లక్షలు మొదలుకొని కోటికి పైగా నడుస్తున్నట్టు విశ్వసనీయసమాచారం.ముఖ్యంగా ఏపీ( AP )కి చెందిన కొందరు పందెం రాయుళ్లు భారీస్థాయిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.అటు ఏపీతో పాటు కర్ణాటక,ఇటు తెలంగాణలో సైతం బెట్టింగ్ ఊపందుకున్నది.