బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన సినిమాల్లో ‘‘యానిమల్’‘( Animal ) ఒకటి.ఈ సినిమా ముందు నుండి భారీ ప్రమోషన్స్ తో హైప్ పెంచేశారు.
ఎన్నో అంచనాల మధ్య నిన్న డిసెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.భారీ స్థాయిలో పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ అవ్వగా పాజిటివ్ బజ్ తెచ్చుకుంది.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో తెరకెక్కడంతో ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది.బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటించిన ‘యానిమల్’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది.

ఈ సీమ తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.కాగా ఈ సినిమా నుండి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమా ఓటిటి రిలీ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.థియేటర్స్ లో మంచి బజ్ తో ముందుకు వెళుతున్న ఈ మూవీ ఓటిటి డేట్ ను లాక్ చేసుకున్నట్టు టాక్.
యానిమల్ సినిమా వచ్చే ఏడాది జనవరి 26 నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ కు రాబోతుందని తాజాగా సమాచారం అందుతుంది.మరి నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకోగా ఈ డేట్ విషయంలో అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.
కాగా ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందించగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.







