శంఖు పుష్పాలు ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుతాయని తెలుసా?

శంఖు పుష్పాల( Butterfly Pea Flowers ) గురించి పరిచయం అక్కర్లేదు.చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ పుష్పాల్లో ఎన్నో రకాల పోషకాలు మ‌రియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

 How To Use Butterfly Pea Flowers For Hair Details, Butterfly Pea Flowers, Butte-TeluguStop.com

అందుకే చాలా మంది శంఖు పుష్పాలతో టీ తయారు చేసుకుని నిత్యం తీసుకుంటూ ఉంటారు.అయితే శంఖు పుష్పాలు ఆరోగ్యాన్నే కాదు జుట్టును( Hair ) కూడా పెంచుతాయి.

వివిధ కేశ సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి.మరి ఇంతకీ కురులకు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

Telugu Butterflypea, Care, Care Tips, Tonic, Healthy, Latest, Thick-Telugu Healt

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది నుంచి పది శంఖు పుష్పాలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) వన్ టీ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసి ఒక గ్లాసు హాట్ వాటర్ పోసి బాగా కలపాలి.ఆపై మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను చేత్తో క్రష్ చేసుకోవాలి.దాంతో వాటర్ అనేది జెల్ రూపంలోకి మారుతుంది.క్లాత్ సహాయంతో ఆ జెల్ ను సపరేట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి.

Telugu Butterflypea, Care, Care Tips, Tonic, Healthy, Latest, Thick-Telugu Healt

ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తే ఒక మంచి హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకావాలి.

వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే మీ కురులకు చక్కని పోషణ అందుతుంది.

జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

అదే సమయంలో ఈ టానిక్ జుట్టు ఎదుగుదలకు మద్దతు ఇస్తుంది.కురులను ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

మరియు జుట్టును సిల్కీగా షైనీ గా సైతం మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube