కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈనెల 5వ తేదీన త్రిపురారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేసి మంగళవారం నాడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హిల్ కాలనీలోని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నివాసంలో మాజీ సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డ్ మెంబర్లు,మైనార్టీ సెల్, ఎస్సీ,ఎస్టీ సెల్ ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు 400 మందికి పైచిలుకు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 Massive Additions To The Congress Party, Jonnalagadda Srinivas Reddy, Former Mpt-TeluguStop.com

వీరికి సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో సర్పంచులు కలగాని శ్రావణ్(బాబుసాయిపేట) మద్దూరి శ్రీనివాస్ (సత్యనారాయణపురం) జొన్నలగడ్డ రమేష్ రెడ్డి (కామారెడ్డిగూడెం),చెవుల రామయ్య(అలవలపాడు) గుండ్లపల్లి సునీత వెంకట్ రెడ్డి(రాజేంద్రనగర్),మాజీ సర్పంచులు బొబిడి అనంతరెడ్డి,జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రెమడాల హుసేన్,వేగుళ్ల శ్రీనివాస్ గుడిపాటి వెంకన్న,చిన్న మట్టయ్య,కాపువారిగూడెం ఉప సర్పంచ్ లు చేపూరి మట్టయ్యచారి, ధర్మ అరుణ్ కుమార్ రెడ్డి, గున్నూరు సూరారెడ్డి, గున్నూరు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

వీరి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు, మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ళ బుచ్చిరెడ్డి, జెడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్,ఎంపీపీ గౌరవ సలహాదారుడు అనుముల శ్రీనివాస్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్టు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube