మనిషి మేధస్సును పెంచేవి పుస్తకాలు

నల్లగొండ జిల్లా:మనిషి మేధస్సును,విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం అల్వాల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు పరమేష్ అన్నారు.మంగళవారం అల్వాల ప్రాధమికొన్నత పాఠశాలలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 Books Increase Human Intelligence , Human Intelligence, Books Increase, Jyoti,-TeluguStop.com

పిల్లలతో పుస్తక పఠనం చేయించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఎక్కువమంది పుస్తకాలు చదవటం మానేస్తూ,కేవలం వాట్సప్‌, ఫేస్‌ బుక్‌,ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విహరించడం ద్వారా తాత్కాలిక వినోదం పొందుతున్నారని అన్నారు.

అసలైన విజ్ఞానం పుస్తకాల్లో దాగి ఉందన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.పుస్తకం పఠనం అందరం అలవాటు చేసుకోవాలని అన్నారు.

ఒక్క పుస్తకం ద్వారా అందుకున్న విజ్ఞానం మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు.చిరిగిన చోక్కా అయినా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అని మహనీయులు అన్న సూక్తిని గుర్తుంచుకోవాలని అన్నారు.

ఓ మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానమని అన్నారు.ప్రస్తుత కాలంలో పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయిందని,సామాజిక మాధ్యమాల వాడకం పూర్తిగా తగ్గించాలన్నారు.

విద్యార్థులు వేసవిలో పుస్తకాలు చదవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి, పాపని,బాలకృష్ణ, విజయలక్ష్మి,లింగమ్మ వీరయ్య,గౌస్ బాబా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube