మునుగోడు గడ్డమీద కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురుతుంది:రేవంత్ రెడ్డి

నల్గొండ జిల్లా:మునుగోడు గడ్డ మీద కాంగ్రేస్ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మునుగోడు కాంగ్రేస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి,ఎమ్మెల్యే పదవికి రాజనామా చేయడంతో అక్కడ పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కాంగ్రేస్ దూకుడు పెంచింది.

 The Flag Of The Congress Party Will Fly On Munugodu's Soil: Revanth Reddy-TeluguStop.com

అందులో భాగంగా శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రేస్ నిర్వహించిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని శ్రేణులను కోరారు.గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని, అప్పుడు వారి త్యాగాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.మునుగోడులో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా గంటలో దామోదరెడ్డి వస్తారని,రెండు గంటల్లో తాను వస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు.దామోదర్‌రెడ్డితో కలిసి సభావేదికపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేశారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే మనకు తెలంగాణ తల్లి అని, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదని,అయినా చింతించలేదని, ప్రజాప్రయోజనమే తప్ప అధికారం కాదని సోనియా భావించారని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకే మూసేసిన (నేషనల్‌ హెరాల్డ్‌) కేసును తెరిచారు.

అన్యాయంగా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు నోటీసులిచ్చారు.కరోనాతో పూర్తిగా కోలుకోకముందే సోనియాగాంధీకి మరోసారి నోటీసులు ఇచ్చారు.

పార్టీ అధినేత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిది.మన కన్నతల్లిని అవమానిస్తుంటే మనం తట్టుకోగలమా? సోనియాగాంధీని ఈడీ విచారణ జరుపుతుంటే రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా దగ్గరకు వెళ్లారు.కాంగ్రెస్‌ పోరాటంలో కలిసిరాలేదు.కానీ,కాంట్రాక్టుల కోసం అమిత్‌ షా దగ్గరకు వెళ్లారు.ఒక్క ఎమ్మెల్యే పోయినా కాంగ్రెస్‌కు ఒరిగిందేమీలేదు.ఎందుకు భాజపాలోకి వెళ్లావని అడుగుతున్నా.

పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి.మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్‌ చెబుతున్నారు.

ప్రధాని మోదీ,హోం మంత్రి అమిత్‌ షా నుంచి మునుగోడుకు నిధులు తెస్తావా? నెలరోజులు జైల్లో ఉన్న నాతో కలిసి పనిచేయలేనని రాజగోపాల్‌ చెబుతున్నారు.మరి 90 రోజులు జైల్లో ఉన్న అమిత్‌షాతో ఎలా కలిసి పనిచేస్తావు? 2014లో తర్వాత తెరాస నాపై 120 కేసులు పెట్టింది.అయినా భయపడలేదు.కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తానని చెప్పా.తెలంగాణ సంస్కృతి అమ్ముడుబోయే సంస్కృతి కాదు.సహాయం చేసే సంస్కృతి.

ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉంది.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? ఇప్పుడు మోసం చేసిన వ్యక్తి రేపు మరోసారి మోసం చేయడా?రాజగోపాల్‌రెడ్డి లాంటి విశ్వాసఘాతుకుడిని నేనెప్పుడూ చూడలేదు.ఈ మునుగోడు గడ్డ మీద రాజగోపాల్‌రెడ్డిని పాతిపెడదాం.ప్రజలంతా కాంగ్రెస్‌ పక్కన నిలబడండి అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube