బాసర విద్యార్థులకు బాసటగా బహుజన సమాజ్ పార్టీ ధర్నా

నల్లగొండ జిల్లా:బాసర ట్రిపుల్ ఐటీని రాష్ట్ర ముఖ్యమంత్రి,లేదా మంత్రి కేటీఆర్ సందర్శించి అక్కడ నెలకొన్న విద్యార్థుల సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్ పూదరి సైదులు హెచ్చరించారు.బాసర విద్యార్థులకు బాసటగా ఉండాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.

 Bahujan Samaj Party Dharna As A Bastion For Basra Students-TeluguStop.com

ఎస్.ప్రవీణ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్ మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటికీ శాశ్వత విసిని నియమించక పోవడంతో క్యాంపస్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రానికే తలమాణికంగా ఉండాల్సిన బాసర ట్రిపుల్ ఐటీలో కనీస వసతులు లేవని వేలాది మంది విద్యార్థులు ఆందోళన చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.

తక్షణమే క్యాంపస్ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్స్,స్టడీ మెటీరియల్స్,డ్రెస్సులు ఇతర సదుపాయాలు అందించి ఐటీసీ తరహాలో బోధన చేయాలని,మెనూ ప్రకారం భోజనం వసతులు కల్పించాలని,తరగతి గదుల్లో ఫర్నిచర్,ఫ్యాన్లు,విద్యుత్తు వంటి సదుపాయాలను కల్పించి విద్యను సక్రమంగా కొనసాగేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం బీఎస్పీ నల్లగొండ జిల్లా మహిళా కన్వీనర్ నిర్మల మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,దీనిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించని యెడల బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ వంటేపాక యాదగిరి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోడి భీమ్ ప్రసాద్,జిల్లా ఈసీ నెంబర్ మామిడి ప్రమీల,ఆర్గనైజింగ్ సెక్రటరీ అంబాల అనిల్,జిల్లా నాయకులు పెరిక కరణ్ జయరాజు,నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని,మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి మల్లిగా యాదయ్య,నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేశ్వర్లు,నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షులు చింత శివరామకృష్ణ,మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube