పరాయి దేశంలో మన పాటలు వింటే ఆనందమే వేరు.అదికూడా అమెరికా( America ) అధికారిక భవనంలో “సారే జహాసే అచ్ఛా”( Sare Jahan Se Achha ) పాడటం విన్నప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చే ఆనందం కలుగుతుంది.
సోమవారం అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన విందుకు హాజరైన భారతీయ అతిథులకు ఎదురైన అనుభవం ఇది.
వైట్ హౌస్ లో( White House ) ఉండే అఫీషియల్ బ్యాండ్ ‘సారే జహాసే అచ్ఛా’ వాయించడంతో వారంతా ఎంకరేజ్ చేశారు.యూఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్‌మూర్తి ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు.ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయిలు, పసిఫిక్ ద్వీప వాసులపై అధ్యక్షుడి సలహా మండలి స్థాపన పాతికేళ్లు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వైట్ హౌస్‌లో ప్రత్యేక వేడుక జరిగింది.
ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు భారతీయ రుచులైన సమోసాలు, పానీ పూరీలను అందించారు.వందల ఏళ్ల క్రితమే స్థానిక హవాయి వాసులు ఆసియా వలసదారులను స్వాగతించారని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్( President Joe Biden ) అతిథులకు తెలిపారు.తమ భూమిని వదులుకుని ఏకీకరణ చేశామన్నారు.ఇలా రెండు వర్గాల వారసత్వం దేశ చరిత్రలో భాగమైందన్నారు అధ్యక్షుడు జో బిడెన్.కాగా, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ బుట్రియా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు.దింతో అవి కాస్త ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
.