జోరుగా పార్టీల బ్యాలెట్ ఫైట్

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల( Telangana State Assembly Elections ) ప్రచార ఘట్టం చివరిదశకు చేరుకుంది.నేడు సాయంత్రం 5 గంటలకు పార్టీల ప్రచార మైకులుమూగబోనున్నాయి.

 Loud Party Ballot Fight-TeluguStop.com

ఈ నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థులు పార్టీ గుర్తుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు.

కానీ,ప్రధానంగా బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్యే ఢీ అంటే ఢీ అనే విధంగా ప్రచారం సాగింది.బీజేపీ,బీఎస్పీ, వామపక్షాలు కూడా ప్రచార పర్వాన్ని ఓ రేంజ్ లో సాగించాయి.

మిగతా పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు కూడా వీరికి తీసిపోకుండా ప్రచారాన్నినిర్వహించారు.ప్రచార పర్వానికి నేటితో శుభం కార్డు పడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్దులు బ్యాలెట్ గుర్తుల ప్రచారంపైనే కాకుండా డబ్బుల పంపిణీ పై కూడా సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ సారి ఎమ్మెల్యే ఎన్నికలు కూడాస్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా డబ్బు పంపిణీ అవుతుందనే ప్రచారం జరుగుతుంది.పల్లె పట్నం అనే తేడా లేకుండా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొంది.

ఇప్పటి ఎన్నికల బరిలో నిలబడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు లక్షలలో ఖర్చుపెట్టి ఆటోలు,టాటా ఏసీలు,కార్లకు మైకులు ఏర్పాటు చేసి,బ్యానర్లు కట్టించి ప్రచారం చేశారు.

ఇప్పుడు మోడల్ ఈవీఎంల( EVMs )తో ఓటర్లకు గుర్తుపై అవగాహన కలిగించే పనితో పాటు తమ పార్టీకే ఓటేయాలని,ప్రత్యర్ధి పార్టీల లోపాలను ఎత్తిచూపుతూ, ఓటు వేస్తే తామేమీ చేస్తామో వివరించే పనిలో పడ్డారు.

పనిలో పనిగా న్యూట్రల్ ఓట్లపై ఫోకస్ పెట్టారు.పార్టీల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు వాడవాడా, ఇటింటికి తిరుగుతూ ఓటర్లకు స్వయంగా కలిసి గుర్తు గుర్తుంచుకో మమ్ముల్ని గుర్తుంచుకో అని చేస్తున్న ప్రచారంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా జాతీయ పార్టీ నాయకులతో ధీటుగా ప్రచారం చేస్తూ అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలనే ధీమాతో ఉన్నారు.దీనితో మూడు రోజుల ముందే జిల్లాలో ఓట్ల పండుగ కనిపిస్తుంది.

నేటి నుండి మద్యం దుకాణాలు బంద్ కావడంతో ఇప్పటికే కావలసిన మద్యాన్ని డంప్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రచారం ఎలా ఉన్నా,పైసలు ఎంత ఖర్చు చేసినా పోలింగ్ బూత్ లో ఓటరు ఎవరికీ ఓటేస్తారో తెలియని అయోమయ స్థితిఅలాగే కొనసాగుతుంది.

సర్వేలు సైతం అందకుండా ఈ ఓటరు నాడి ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తుంది.ఈ నెల 30న జరిగే పోలింగ్ పోటీలో ఉన్న ఎవరికి అనుకూలంగా మారనుందో?వారం తర్వాత ఎవరి ముఖాల్లో ఆనందం నింపుతుందో? ఎవరికి విషాదం మిగిలిస్తుందో ఆ ఓటరు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube