వైరల్: షాపులో వింత ప్రచారం.. ఆ నోట్లకు వస్తువులు అమ్మబడవు అంటూ..

ప్రజాస్వామ్రాజ్యంలో ప్రజలు ఓటు హక్కు( Right To Vote ) వినియోగించుకోవడం అనేది రాజ్యాంగం దేశపు ఇచ్చిన హక్కు.కాకపోతే మనలో కొందరు ఈ ఓటును వేలం పాటలో వస్తువులను అందినట్లుగా వారి భవిష్యత్తును ప్రజాప్రతినిధులను అమ్ముకుంటున్నారు.

 Gudivada Shop Owner Board Not To Sell Goods For People Took Money In Ap Election-TeluguStop.com

అందులో కూడా మాకు కచ్చితంగా ఎంత కావాలంటూ వల్ల కొద్ది మరి డబ్బులు ఇప్పించుకుంటున్నారు ఓట్లు వేయడానికి.ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాల్లో అయితే తమకు ఓటుకు డబ్బు ఇవ్వలేదని అందుకు తాము ఓటు వేయమంటూ ఓటును బహిష్కరించిన మహాశయులు కూడా ఉన్నారు.

ఇలాంటి సమాజంలో కూడా కొందరు మంచోళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా.అవునండి ప్రస్తుతం వైరల్ గా మారిన ఓ బోర్డ్ చూస్తే నిజంగా మెచ్చుకోకుండా ఉండలేరు.

తాజాగా ఓ షాపు యజమాని( Shop Owner ) ఓటరు మహాశయులారా.నోటుకు ఓటు అమ్ముకున్న డబ్బులతో తమ షాపుకు వస్తువులు కొనేందుకు అసలు రావద్దంటూ బోర్డు పెట్టాడు.ఈ దెబ్బతో అటువైపుగా వెళ్తున్న జనం ఒకసారిగా షాక్ అయ్యారు.గుడివాడలో( Gudivada ) ఓ రేడియో షాపు యజమాని ఈ కొత్త రకమైన ప్రచారాన్ని ఎన్నుకున్నాడు.

నగరంలో కొందరు వ్యక్తులను ఉద్దేశించి ఈ సందేశం ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతుంది.అయితే ఈ సందేశం చాలామంది ప్రజలను ఆకర్షించింది.దీంతో ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో( Social Media ) నెటిజన్స్ వారి స్టైల్ లో స్పందిస్తున్నారు.ఇలాంటివారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంతో ఆదర్శం అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే ఏవి రాజకీయ నాయకులు పంచిన నోట్లు, ఏది నిజాయితీగా సంపాదించిన నోట్లు కనుక్కోవడం ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube