నేడు మన దేశానికి సనాతన ధర్మం కాదు సమతా ధర్మం కావాలి: కామ్రేడ్ జేఎస్ఆర్

నల్లగొండ జిల్లా: ఇటీవల తమిళనాడు అభ్యుదయ రచయితల,కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన “సనాతన ధర్మాల నిర్మూలన” సభలో ఆ రాష్ట్ర మంత్రి,సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ “సనాతన ధర్మాలను నిర్మూలించాలని” చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన హిందుత్వ శక్తులు ఉదయనిధిని చంపినవారికి రూ.10 కోట్లు నజరానా కూడా ప్రకటించి,ఇస్లాం మతఛాందసులు,హిందూ మతఛాందసులు ఒక తానుముక్కలేనని నిరూపించుకున్నారని బహుజన నేస్తం అవార్డు గ్రహీత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర సెక్రటరీ,జై భారత్ వజ్రం క్రాంతి త్రినేత్రుడు రిషి బోర అన్నయ్య, జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న కామ్రేడ్ జెఎస్ఆర్ యాదవ్ మండిపడ్డారు.

 Our Country Needs Samata Dharma Not Sanatana Dharma Comrade Jsr, Samata Dharma-TeluguStop.com

రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని మోదీ, ఆంతరంగిక మంత్రి అమిత్ షాలు తాము చేసిన ప్రమాణాలను ప్రక్కనపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా “సనాతన ధర్నాల”ను విమర్శించిన వారిపై తిరుగుదాడి చేయాలని తమ పార్లమెంట్ సభ్యులకు,బీజేపి సభ్యులకు పిలుపివ్వడం భారతజాతికే అవమానమని అభ్యుదయ వాది అణగారిన కులాల పక్షపాతి కామ్రేడ్ జేఎస్ఆర్ యాదవ్ విమర్శించారు.

సనాతన ధర్మం అంటే మార్పు చెందనిది.సనాతన ధర్మం హిందూ మతానికి ప్రాతిపదిక.హిందూ మతమంటే బ్రాహ్మణ మతం లేదా బ్రాహ్మణిజం.దీనికి మనుస్మృతులు, భగవద్గీత మూలసిద్ధాంత గ్రంథాలు.

ఇవి వర్ణాశ్రమ ధర్మాలను బలపరుస్తాయి.కులం,మతం,లింగ వివక్షత,శూద్రులు (శ్రమజీవులు) బ్రాహ్మణ, క్షత్రియులు,వైశ్యులకు ఊడిగం చేయాలని అవి నిర్దేస్తాయి.

ఆధునిక యుగంలో సమాజంలో వస్తున్న మార్పులను, సైన్సు అభివృద్ధిని చూసి బెంబేలెత్తుతున్న కరుడుగట్టిన హిందూ, ఇస్లాం మతోన్మాదులు సనాతన ధర్మం పేరిట ప్రజలను ప్రత్యేకించి స్త్రీలను,శ్రామిక వర్గాన్ని అణచివేయాలని, పితృస్వామిక వ్యవస్థ భావజాలాన్ని పునరుజ్జీవింపచేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ లాంటి హిందూ మత సంస్థలు.

తాలిబాన్,అల్ ఖైదా లాంటి ఇస్లాం మత తీవ్రవాద సంస్థలు అగ్రభాగాన ఉన్నాయని తెలిపారు.భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ కర్తవ్యాన్ని మోదీ ప్రభుత్వం నెరవేరుస్తున్నది.

కానీ,భౌతికశాస్త్రం ప్రతిదీ మార్పు చెందుతుందని, శాశ్వతం అంటూ ఉండదని తెలియ చేస్తుంది.డార్విన్ పరిణామవాద శాస్త్రం.మార్క్స్ -ఎంగెల్స్ భౌతికవాద,చారిత్రకవాద సిద్ధాంతాలు దీనిని సోదాహరణగా వివరించాయి.ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన బుద్ధిజం సైతం ఏదీ శాశ్వతం కాదని స్పష్టం చేసింది.

సనాతన లేదా శాశ్వతం అనేది లేదని, ప్రతిదీ మార్పు చెందుతుందని చెప్పారు.కాబట్టి నేడు మన దేశానికి కావలసింది సనాతన ధర్మం కాదు.సమధర్మం కావాలని ప్రజాతంత్ర ఉద్యమకారుడు,నక్సల్ బరి విప్లవకారుడు,పీడిత వర్గాల విముక్తికై నూతన ప్రజాస్వామ్య విప్లవమే మార్గమని చాటి చెబుతున్న కమ్యూనిస్టు పోరాట యోధుడు కామ్రేడ్ జేకేఆర్ గారి జెఎస్ఆర్ యాదవ్ నేడు దేశ ప్రధానికి ఒక బహిరంగ లేఖ రాశారు.500 సంవత్సరాల క్రితం ఉన్న ధర్మం నేడు పనికిరాదు.

మార్పు అనేది కాలం,ప్రదేశాన్ని బట్టి మారుతుంది.మతం, మూఢనమ్మకాలు దేశాన్ని వెనక్కు తీసుకెళతాయని, ఈ రోజు ఉన్న ధర్మం రేపు అధర్మమవుతుందని శ్రామిక వర్గ రాజ్యాధికార జన చైతన్య శ్రామిక రాజ్యం స్థాపన కోసం తన వంతు ప్రయత్నిస్తున్న కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జేకేఆర్ గారి రాజన్న చెప్పాడు.

నేటి సమాజానికి కావలసింది సమధర్మం,సమానత్వం, నిష్పక్షపాత న్యాయం, పితృస్వామిక వ్యవస్థ నిర్మూలన కావాలని దేశ ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో అణగారిన వర్గాల హక్కులకై గత మూడు దశాబ్దాలుగా సామాజిక కార్యకర్త,ప్రగతిశీల ప్రజాతంత్ర విప్లవ నాయకుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ నేతాజీ రాజన్న నొక్కిచెప్పాడు.

సనాతన ధర్మం పేరిట జరుగుతున్న అన్యాయాలను జేకేఆర్ గారి జేఎస్ఆర్ ఖండించడమే గాక, సామాజికాభివృద్ధికి పురోహితవర్గం అడ్డంకిగా ఉందని దేశ ప్రజానీకానికి రాసిన బహిరంగ లేఖలో జెఎస్ఆర్ నేతాజీ రాజన్న హెచ్చరించాడు.

సనాతన ధర్మంపైన,కుల,మతాలపైన తిరుగుబాటుకూ దేశవ్యాప్తంగా ఉన్న అణగారిన కులాల ప్రజలు, ప్రజాతంత్ర వాదులు యుద్ధం ప్రకటించాలని పేర్కొన్నారు.నేడు పరిస్థితులు మారాయని, ఆనాటి సంస్కరణ ఉద్యమాల స్ఫూర్తితో ప్రజాతంత్ర విప్లవాత్మక తిరుగుబాటు ఉద్యమాలు పెద్ద ఎత్తున కొనసాగాలని అనుదినం జన ప్రతిక్షణం ప్రజాహితం కోసం కృషి చేస్తున్న కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జెఎస్ఆర్ పిలుపునిచ్చారు.

కారణాలు ఏమైనా మతోన్మాదాన్ని సైద్ధాంతికంగా,భౌతికంగా ఎదుర్కోగలిగిన వామపక్షాలు బలహీనపడ్డాయని,లౌకిక, ప్రజాస్వామిక విధానాల ఎడల కాంగ్రెస్ ఊసరవెల్లి రాజకీయాలు అనుసరించడంతో మతోన్మాద శక్తులు బలపడ్డాయని,ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ శక్తులు అధికారంలో పాతుకుపోయాయని,శాస్త్రీయ భావాలకు ప్రత్యామ్నాయంగా సనాతన ధర్మాలకు ప్రాణప్రతిష్ట చేయడానికి హిందూ మత శక్తులు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాయని, నిరుపేదల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న విప్లవాల వర్గ పోరాట శ్రామిక వర్గ కామ్రేడ్ సుభాషన్న ఈ సందర్భంగా తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తూ కాసేపు కన్నీరు కార్చారు.

మతతత్వవాదులు చేస్తున్న మతోన్మాద ప్రయత్నాలను వమ్ముచేయాలి.

రాజ్యాంగాన్ని,లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాపాడాలి.వామపక్ష, లౌకిక,ప్రజాస్వామిక, దేశభక్త జాతీయవాదులను ఐక్యవేదిక మీదకు తీసుకురావాలి.

దీనికి కమ్యూనిస్టు పార్టీలు , దళిత బహుజన ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు లౌకిక శక్తులు కీలక పాత్ర వహించాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న 9848540078 కార్మిక,కర్షక,పీడిత ప్రజలకు అణగారిన కులాల వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube