ఎమ్మెల్యేను నిలదీసిన సర్పంచ్

నల్లగొండ జిల్లా:నకిరేకల్ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా నిరసన సెగ నీడలా వెంటాడుతునట్లు కనిపిస్తుంది.

బుధవారం నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో బడిబాట కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్,సీపీఎం నాయకులు,మహిళల రూపంలో మరోసారి నిరసన సెగ తగిలింది.

గ్రామపంచాయతీ తీర్మాణాలు లేకుండా గతంలో తీర్మాణాలు చేసినవాటిని వదిలేసి ఇష్టారాజ్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేయడం,గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ఎమ్మెల్యేను గ్రామ సర్పంచ్,సీపీఎం గ్రామ శాఖ నాయకులు నిలదీయడంతో టీఆర్ఎస్ నాయకులకు, సీపీఎం నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎందుకొస్తున్నారని స్థానిక మహిళలు ప్రశ్నించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

దీనితో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అనంతరం ఎమ్మెల్యే బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఓ మహిళా సర్పంచ్ నని చూడకుండా,కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో అభివృద్ధి పనుల విషయంలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎంపీటీసీ,అధికార పార్టీ నాయకులతో ప్రారంభోత్సవాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

Advertisement

గ్రామ పంచాయతీ తీర్మానాలు చేసిన పనులను పక్కకు పెట్టి,ఇష్టానుసారంగా వారికి నచ్చిన చోట సీసీ రోడ్లు వేసుకుంటున్నారని,ఇదే విషయమై ఎమ్మెల్యేను అడుగుతుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు.

మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్...!
Advertisement

Latest Nalgonda News