తెలంగాణాలో దంచి కొడుతున్న వర్షం...!

నల్లగొండ జిల్లా:హైదరాబాద్‌( Hyderabad )లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తున్నది.మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది.

 Heavy Rain In Telangana Hyderabad , Heavy Rains , Khammam , Nalgonda District-TeluguStop.com

ఖైరతాబాద్‌,అమీర్‌పేట, సోమాజీగూడ,నాంపల్లి, మలక్‌పేట,సైదాబాద్, పాతబస్తీ,ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్‌, హస్తినాపురం,బీఎన్‌రెడ్డి, నాగోల్‌,ఉప్పల్‌, హబ్సిగూడ,తార్నాక, ఈసీఐఎల్‌,ఉదయం నుండి వర్షం కురుస్తుంది.కాగా సికింద్రాబాద్‌, బేగంపేట,అడ్డగుట్ట, మారేడుపల్లి,ప్యాట్నీ, ప్యారడైస్‌,బోయిన్‌పల్లి, సుచిత్ర,కొంపల్లి, తిరుమలగిరి,అల్వాల్‌, బొల్లారం,చిలకలగూడ, కూకట్‌పల్లి,హైదర్‌నగర్‌, నిజాంపేట్‌,ప్రగతినగర్‌, కేపీహెబీ కాలనీ,ఆల్విన్‌ కాలనీ,మియాపూర్‌, కుత్భుల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, కొండాపూర్‌,మాదాపూర్‌, గచ్చిబౌలి,జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతున్నది.

దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ( GHMC ) అధికారులు,సిబ్బంది అప్రమత్తమయ్యారు.రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.

వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు.కాగా,నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.11 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు,18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.జగిత్యాల, కరీంనగర్‌,వికారాబాద్‌, సంగారెడ్డి,మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని,ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

ఎల్లో అలర్ట్ జారీచేసిన జిల్లాల్లో ఆసిఫాబాద్‌,మంచిర్యాల, నిర్మల్‌,నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి,కొత్తగూడెం, ఖమ్మం,నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, హన్మకొండ,సిద్దిపేట, కామారెడ్డి,వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్‌,మేడ్చల్‌, మల్కాజిగిరి,రంగారెడ్డి, యాదాద్రి,సంగారెడ్డి, వికారబాద్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీచేసింది.ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది.

ఇక మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి,ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌,హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్క అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌,రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ,సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి,మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube