నల్లగొండ జిల్లా:హైదరాబాద్( Hyderabad )లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తున్నది.
మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది.ఖైరతాబాద్,అమీర్‌పేట, సోమాజీగూడ,నాంపల్లి, మలక్‌పేట,సైదాబాద్, పాతబస్తీ,ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్, హస్తినాపురం,బీఎన్‌రెడ్డి, నాగోల్,ఉప్పల్, హబ్సిగూడ,తార్నాక, ఈసీఐఎల్,ఉదయం నుండి వర్షం కురుస్తుంది.
దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ( GHMC ) అధికారులు,సిబ్బంది అప్రమత్తమయ్యారు.రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.
వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు.కాగా,నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది.ఇక మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి,ములుగు, మహబూబాబాద్, వరంగల్,హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్క అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్,రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ,సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది.