పటాస్ కార్యక్రమాల ద్వారా తెలుగు బుల్లితెరపై సందడి చేసినటువంటి వారిలో యాదమ్మ రాజు( Yadamma Raju ) ఒకరు ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యాదమ్మ రాజు ప్రస్తుతం జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో సందడి చేయడమే కాకుండా ఇతర బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర అవకాశాలను కూడా అందుకొని కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.ఇక ఈయన స్టెల్లా( Stella )ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే ఈ జంట సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను సందడి చేస్తూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

గత కొన్ని నెలల క్రితం వివాహం( Marriage )చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఈ దంపతులు మరోసారి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.ఎందుకు సంబంధించిన ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఒకసారి పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట తిరిగి మరోసారి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే… పెద్దల సమక్షంలో సాంప్రదాయపద్ధంగా వివాహం చేసుకున్నటువంటి వీరిద్దరూ తమ వివాహాన్ని చట్టబద్ధం చేయాలన్న ఉద్దేశంతో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలని భావించారట.

ఈ క్రమంలోనే రిజిస్టర్ కోసం కొన్ని నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే అధికారులు తమ మ్యారేజ్ ను రిజిస్టర్ చేశారు.అయితే మ్యారేజ్ రిజిస్టర్ చేయడం కోసం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినటువంటి ఈ జంట అక్కడ మరోసారి పెళ్లి చేసుకున్నారు.ఇక వీరిద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడంతో రిజిస్టర్ ఆఫీసర్స్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుందని, వారు పట్టుచీర, పట్టుపంచెలతో వచ్చి, అక్కడ దండలు మార్చుకోవాలని, స్వీట్స్ తేవాలని, ఆ తర్వాత వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారని ఆ అధికారులు చెప్పారంట.
ఇలా అధికారుల సమక్షంలో మరోసారి దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నటువంటి ఈ తతంగం మొత్తం వీడియో రూపంలో చిత్రీకరించి తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.