నేడు మరోసారి దద్దరిల్లనున్న అసెంబ్లీ

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక ఘట్టం ఆవిశ్కృతం కానుంది.అధికార కాంగ్రెస్‌ పార్టీ వివిధ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

 Telangana Assembly Sessions Today,telangana Assembly , Cm Revanth Reddy, Congres-TeluguStop.com

ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకానుంది.ముందుగా సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు.

ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై లఘు చర్చ ఉంటుంది.గత తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిందని,సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.

వీటిపై శాసససభ వేదికగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని అయన కోరారు.ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది.తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్‌ అసత్య ప్రచారం చేస్తోందని,దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆ పార్టీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.కేటీఆర్‌, హరీశ్‌రావు,ఇతర ముఖ్యనేతలు విడిగా సమావేశమై బుధవారం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే చర్చించినట్లు తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చే అంశాలపై అసెంబ్లీలోనే తాము కూడా పీపీటీ ద్వారా వాదన వినిపించాలని,బీఆర్ఎస్ నిర్ణయించింది.అసెంబ్లీలో పీపీటీకి తమకూ అవకాశమివ్వాలని కోరుతూ,ఇప్పటికే స్పీకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు వినతిపత్రం అందజేశారు.

దీనిపై సభాపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అసెంబ్లీ సమావేశాల ఆరంభంలోనే అధికార కాంగ్రెస్,విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.

పరస్పర ఆరోపణలతో సభ హీటెక్కింది.గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం డిసెంబర్ 16న, జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన కేటీఆర్‌.

గతంలో కాంగ్రెస్‌ పాలన గురించి ప్రస్తావించగా,గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి మాట్లాడాలని అధికార పార్టీ సభ్యులు సూచించారు.ఈ సందర్భంగా రెండు పక్షాల నాయకుల వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలకు సభ హీటెక్కింది.

ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి,మాటల యుద్ధం తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube