పబ్లిక్ క్లబ్ సెక్రటరీపై విచారణ జరిపించాలి

సూర్యాపేట జిల్లా: పేట పబ్లిక్ క్లబ్ నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయని, క్లబ్ సెక్రెటరీ అవినీతి, అవకతవకలపై ఆర్డీవో తక్షణమే విచారణ జరపాలని పబ్లిక్ క్లబ్ సభ్యుడు, అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి, మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరధ డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా కొప్పుల వేణారెడ్డి ఉన్న సమయంలో దుకాణ సముదాయ నిర్మాణం,జిమ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా క్లబ్ ఆదాయం పెరిగిందన్నారు.

 Public Club Secretary Should Be Investigated,public Club Secretary , Suryapet Di-TeluguStop.com

ప్రస్తుతం క్లబ్ ఆదాయం లక్షలలో ఉందని, ప్రస్తుత సెక్రటరీ క్లబ్ ఆదాయ వ్యయాలను కమిటీ సభ్యులకు తేకుపకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరపాల్సి ఉన్నా ఆ ఊసే లేదన్నారు.

పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ కాంట్రాక్టర్ రెండు సంవత్సరాల అద్దె చెల్లించలేదని వీటన్నిటిపై విచారణ జరిపించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube