నల్లగొండ జిల్లా: కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం మంగళవారం 642.80 అడుగులకు చేరింది.మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 106.30 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి ఉదయ్ కుమార్ తెలిపారు.
మూసీ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా,ప్రస్తుతం 642.80 అడుగులు (3.89 టీఎంసీలు) నీరు నిల్వలు చేరడంతో ప్రాజెక్టు యొక్క 3,4వ నెంబర్ క్రస్ట్ గేట్లను ఎత్తి 2027.29 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు.