నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు మండలం కస్తాల(మెండువారిగూడెం) గ్రామానికి చెందిన బీజేపీ( BJP ) గ్రామ నాయకులు దోనాల శ్రీనివాస్ రెడ్డి,మెండు రాజశేఖర్ రెడ్డి,కుంకుడాల వెంకట్ రెడ్డి,గంటెకంపు శ్రీకాంత్ తదితరులు చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం
టీపీసీసీ ప్రదాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి చలమల్ల కృష్ణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరారు.
వారికి కృష్ణారెడ్డి( Krishna Reddy ) కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ చలమల్ల కృష్ణారెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకే తిరిగి సొంత గూటికి వచ్చామని, చండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయనతో కలిసి నడుస్తామని తెలిపారు.