మంచానపడ్డ గూడూరు... డంపింగ్ యార్డే కారణమంటున్న జనం

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డ్ పుణ్యమా అని పరిసర గ్రామాల ప్రజలు మంచం పట్టాయి.మండల పరిధిలోని గూడూరు గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.

 Bedridden Guduru Dumping Yard Is The Cause Of The People, Bedridden, Guduru ,dum-TeluguStop.com

డంపింగ్ యార్డ్ నుంచి నిత్యం వచ్చే పొగ వలన వాయుకాలుస్యం, దోమలు వ్యాప్తి చెంది మలేరియా,డెంగ్యూ,వైరల్‌ జ్వరాలతో విపరీతమైన శరీర నొప్పులతో గూడూరు ప్రజలు హడలెత్తిపోతున్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నా గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని వాపోతున్నారు.

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని,మురికి కాలువలు శుభ్రం చేయాలని అధికారులకు విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పడుతున్నాయన్న సంబరం కంటే జ్వరాలు సోకుతున్నాయనే ఆందోళనే ప్రజల్లో ఎక్కువగా కనబడుతోంది.

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాలు చేపట్టి చాలా చోట్ల నీటి నిల్వలు,దోమల ఆవాస కేంద్రాలు లేకుండా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా డంపింగ్ యార్డ్ మూలాన గ్రామంలో క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు మాత్రం కనపడడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చులు పెట్టి చికిత్స పొందుతున్నామని,ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం,దగ్గు, జలుబు,తలనొప్పితో బాధపడుతూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

డంపింగ్ యార్డ్ మూలాన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడడంతో ఆయా ఆసుపత్రులలో ఇన్‌పేషంట్‌ లుగా చేరి రోజుల తరబడి చికిత్సలు పొందుతున్నారు.ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి గ్రామాలలో దోమలు నివారణకు చర్యలు తీసుకోవాలని,డంపింగ్ యార్డ్ నుంచి గ్రామ ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube