రహదారిపై రక్తధారలు

నల్లగొండ జిల్లా:ఆదివారం రాత్రి హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలతో జాతీయ రహదారి రక్తసిక్తంగా మారింది.

ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడగా,ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

నల్గొండ జిల్లా కట్టంగుర్ మండలం అయిటిపాముల జాతీయ రహదారిపై ఆగిఉన్న వరికోత మిషన్ ని,కోదాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పాల ట్యాంకర్ వెనుక నుండి వేగంగా ఢీ కొట్టడంతో పాల ట్యాంకర్ లో ఉన్న ఇద్దరికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంకి చెందిన రవీందర్ రెడ్డి,గార్లపాటి నవీన్ గా పోలీసులు గుర్తించారు.

అలాగే కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో సర్వీస్ రోడ్డు నుండి జాతీయ రహదారిపైకి వస్తున్న ఆటోను ట్రాక్టర్ ఎదురుగా ఢీకొట్టడంతో ఆటోలో కుటుంబంతో ప్రయాణిస్తున్న నకిరేకంటి రవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించగా,కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి.జరిగిన ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!
Advertisement

Latest Nalgonda News