ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు భోజనం చేసిన తర్వాత అరటిపండు ( Banana )తింటూ ఉంటారు.అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
ఇది శరీరంలోని నొప్పులను దూరం చేస్తూ ఉంటుంది.ఇందులో ఉన్న డైట్రి ఫైబర్స్ కడుపును శుభ్రం చేయడమే కాకుండా మలబద్ధకం( Constipation ) లాంటి సమస్యను కూడా దూరం చేస్తుంది.
ఉపవాసం చేసేవారు కూడా అరటిపండు తినడం వల్ల సంపూర్ణ ఆహారం తీసుకున్న శక్తిని పొందుతారు.ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నా అరటిపండును తిని పాపం దాని తొక్కని మాత్రం తేలికగా విసిరి పక్కన పడేస్తూ ఉంటారు.
మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అరటిపండు తొక్కలో చర్మ సౌందర్యాన్ని( Skin beauty ) పెంచే గుణాలు ఉన్నాయి.
అంతేకాకుండా కాళ్ల దగ్గర నల్లగా ఉన్న ప్రదేశాలను కాంతివంతంగా అరటి తొక్కతో చేయవచ్చు.ఇంటి వద్దనే ఎటువంటి ఖర్చు లేకుండా సాధారణ పద్ధతిలో అరటి తొక్కను ఉపయోగించి పెడిక్యూర్ చేసుకోవచ్చు.ఈ ఒక్క చిన్న చిట్కాతో పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి చేయించుకున్న రానీ మెరుపు మీ సొంతం అవుతుంది.
మరి అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.అరటిపండు తిన్నాక తొక్క లోపలి తెల్లటి భాగం గుజ్జుగా ఉంటుంది.దాన్ని తీసుకొని మోచేతులకి, మోకాళ్ళకి, కాళ్ళకి ఎక్కడైతే మనకు చర్మం కాస్త పొడి బారి, మొద్దు బారి నల్లగా ఉంటుందో అక్కడ రుద్దాలి.ఇలా చేయడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మురికి పోవడమే కాకుండా మృత కణాలు దూరమైపోతాయి.
పైగా ఇందులో ఉన్న సహజమైన తేమ గుణం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.ముందుగా పాదాలను కూడా శుభ్రం చేసుకొని తుడుచుకోవాలి.ఆ తరువాత అరటిపండు తొక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని పాదం పై బాగా రుద్ది మర్దన చేయాలి.అలాగే ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల సమస్య కూడా దూరమవుతుంది.అంతే కాకుండా చలికాలంలో తేమ వల్ల కాళ్ల మధ్య ఏర్పడే ఇన్ఫెక్షన్లు కూడా దూరం అవుతాయి.
ఇలా అరటి తొక్కను( Banana peel ) ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.