నల్లగొండ జిల్లా: నాడు దేశంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన అమరులను స్మరించడం,వీరులను గౌరవించడం మన అదృష్టమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా ఆఫీసులో బీజేపీ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై ఎమర్జన్సీలో పాల్గొన్న వీరులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీజేపి సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు,బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామోజు షణ్ముఖ, కన్మంతరెడ్డీ శ్రీదేవి రెడ్డి, బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి,దాసోజు యాదగిరాచారి,మిర్యాల సత్యనారాయణ,చీదెల్ల భిక్షం,దానం నాగేందర్, కుర్మిల మోహన్,సురేష్, చంద్రారెడ్డి,సాధినేని శ్రీనివాస్,బీజేపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవిగౌడ్, అయితరాజు సిద్దు, టంగుటూరి శ్యామ్, నెవర్సు నీరజ,హైమావతి, కొండేటి సరిత తదితరులు పాల్గొన్నారు.