ఎంపీ అభ్యర్దులపై తప్పుడు ప్రచార పోస్టర్లు విడుదల చేయకూడదు: ఎస్పీ

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలతో కూడిన అభ్యర్థుల వ్యక్తి గత ప్రచార పోస్టర్లును విడుదల చేయరాదని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థుల తమ ఎన్నికల కరపత్రం లేదా పోస్టర్లు అభ్యర్ధుల ముఖం పేర్లు మరియు ప్రింటర్ మరియు పబ్లిషర్ చిరునామాలు లేనివి ముద్రించడం లేదా ప్రచురించటం వంటివి చేయకూడదన్నారు.

 False Campaign Posters Against Mp Candidates Should Not Be Released Sp, False Ca-TeluguStop.com

ఎవరైన పైన పేర్కొన్న వాటిని ఉల్లంఘిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సెక్షన్ 188,171G IPC, 127A of the Representation of the people act,1951 మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన క్రింద ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయబడతాయని అన్నారు.

అలాగే పార్లమెంటు ఎన్నికలకు నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవేన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు అనగా జూన్ 6, 2024 వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరగదని స్పష్టం చేశారు.దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలు ప్రతి సోమవారం వినతులను సమర్పించేందుకు జిల్లా కార్యాలయానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube