నల్లగొండ జిల్లా(Nalgonda District):ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా మత్తు పదార్థాల విక్రయాలపై నల్లగొండ పోలీస్ శాఖ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఆటోలో తిరుగుతూ ఆవులు తరలిస్తున్న వాహనాలను అడ్డగించి,వారి వద్ద నుంచి డబ్బులు,సెల్ ఫోను అపహరించి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు (Nalgonda One Town Police)అరెస్ట్ చేశారు.వీరి వద్ద నుండి దాదాపు 90 వేల విలువగల 3.5 కేజీల గంజాయి నాలుగు, సెల్ ఫోన్లు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి(Nalgonda DSP Sivaram Reddy) ఆధ్వర్యంలో ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా గంజాయి ముఠా సభ్యులకు చెక్ పెట్టారు.చాకచక్యంగా కేసును ఛేదించిన టూ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వన్ టౌన్ ఎస్ఐ శంకర్,వన్‌టౌన్ సిబ్బంది షకీల్,శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
Latest Telugu Top Posts News