ఒకేసారి ఇద్దరు డాక్టర్లతో అఫైర్ పెట్టుకున్న చైనీస్ నర్స్.. చివరికి..?

కొందరు నైతిక విలువలను మరచి ఒకేసారి ఇద్దరిని ప్రేమిస్తారు లేదా ఇతరులతో అఫైర్ నడిపిస్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలు మన చుట్టూ కామన్‌గా జరుగుతూనే ఉంటాయి.చైనాలో ఒక నర్స్ కూడా ఇలాంటి ఒక పిచ్చి పని చేసింది.

 A Chinese Nurse Who Had An Affair With Two Doctors At The Same Time.. In The End-TeluguStop.com

సేమ్ ఆస్పత్రిలో పని చేసే ఆ నర్స్‌, ఇద్దరు డాక్టర్లతోనూ ప్రేమ సంబంధం పెట్టుకుంది.కానీ, ఆమె ఇద్దరితోనూ ఒకేసారి డేటింగ్ చేస్తున్న విషయం ఆ డాక్టర్లకు తెలియదు.

తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు డాక్టర్లు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం మొదలుపెట్టారు.ఈ గొడవ ఎంత తీవ్రంగా తయారైందంటే, వారిలో ఒకరు ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, చైనా( China ) దేశంలోని జియాంగ్‌సు ప్రాంతంలోని వుక్సి పీపుల్స్ ఆస్పత్రిలో పని చేసే ఇద్దరు డాక్టర్లు ఒకే నర్స్‌ (27)ను ఇష్టపడ్డారు.ఇద్దరూ 50 ఏళ్ల వయసులో ఉన్నారు.ఆ డాక్టర్లు ఆ ఆస్పత్రిలోనే పని చేస్తున్న నర్స్‌తో ప్రేమలో పడ్డారు.కానీ, ఇద్దరూ ఆమెతోనే ప్రేమ సంబంధం పెట్టుకున్నారని తెలిసి, వారిద్దరి మధ్య ఎంతో పెద్ద గొడవ జరిగింది.

ఈ గొడవలో ఒక డాక్టర్‌కు తలకు తీవ్ర గాయమైంది.గాయపడిన ఆ డాక్టర్ పేరు జు.ఆయన్ని ముందు ఆ ఆస్పత్రిలోని ఎముకల వైద్య విభాగంలో చికిత్స చేసి, తర్వాత ఐసీయూకి తరలించారు.

ఆ నర్స్‌కు ఇద్దరు డాక్టర్లు( Doctors ) బహుమతులు ఇచ్చారు.ఒక డాక్టర్ ఆమెకు బంగ్లా కొనిచ్చాడు.మరొక డాక్టర్ కారు ఇచ్చాడు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ సంఘటన గురించి వెల్లడించింది.ఈ విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, దోషిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక అధికారి చెప్పారు.

ఈ ఘటన జరిగిన తర్వాత ఆ నర్స్ తన ఇంటికి వెళ్ళిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube