కవిత కోసం .. బీఆర్ఎస్ కు ఎన్ని కష్టాలో ? 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) ఢిల్లీ లెక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఆమె జైలుకు వెళ్లి నెలలు గడుస్తున్నా.

 Brs Party Leaders Facing Troubles With Mlc Kavitha Arrest Details, Brs, Bjp, Con-TeluguStop.com

ఇప్పటివరకు ఆమెకు బెయిల్ లభించకపోవడం, ఈ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో, బీఆర్ఎస్ లో( BRS ) టెన్షన్ పెరిగిపోతుంది.ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం,  ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకోకపోవడం,  రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేకపోవడం,  పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఇతర పార్టీలో చేరిపోతుండడం వంటివన్నీ బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరంగా మారింది.

  ప్రస్తుతం కవితను బయటకు తీసుకురావడమే బిఆర్ఎస్ కు పెద్ద టాస్క్ గా మారింది.

Telugu Brs, Congress, Hareesh Rao Ktr, Harish Rao, Mlc Kavitha, Telangana-Politi

ప్రస్తుతం కేటీఆర్,( KTR )  హరీష్ రావులు( Harish Rao ) ఢిల్లీ చుట్టూ తిరుగుతూ,  కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.సీనియర్ లాయర్లు,  న్యాయ నిపుణుల తో చర్చిస్తూనే బిజెపి పెద్దలతోనూ మంతనాలు చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.అదే కాకుండా త్వరలోనే బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయబోతున్నారనే వార్తలు వస్తుండగా,  దీనిని కేటీఆర్ ఖండించారు.

కవితను ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( KCR ) పరామర్శించలేదు .తాను జైలుకు వెళ్లి కవితను పరామర్శించకూడదని నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.ఈడి , సిబిఐ కేసుల్లో త్వరగా రావడం కష్టమనే విషయం కెసిఆర్ కు బాగా తెలుసు.

Telugu Brs, Congress, Hareesh Rao Ktr, Harish Rao, Mlc Kavitha, Telangana-Politi

అయితే బిజెపి పెద్దలు తలుచుకుంటే అది సాధ్యమవుతుందని కెసిఆర్ నమ్ముతున్నారు.  అందుకే బీజేపీతో రాజకీయ వైరం పెట్టుకున్నా.కలిసి వచ్చేది లేదని,  ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ఆ పార్టీ పెద్దలతో సన్నిహితంగానే ఉంటే రాజకీయంగాను, కవిత విషయంలోనూ సానుకూలత ఉంటుందని భావిస్తున్నారట.

అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయకుండానే బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నం అయ్యారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube