బ్రిటీష్ గ్రాండ్ మాస్టర్‌గా భారత సంతతి బాలుడు.. ఎవరీ శ్రేయస్ రాయల్ ..?

భారత సంతతికి చెందిన 15 ఏళ్ల చెస్ క్రీడాకారుడు బ్రిటీష్ గ్రాండ్‌మాస్టర్‌గా( British Grandmaster ) చరిత్ర సృష్టించాడు.బెంగళూరులో జన్మించిన శ్రేయాస్ రాయల్.

 15 Years Old Indian Origin Boy Becomes Youngest British Chess Grandmaster Detail-TeluguStop.com

( Shreyas Royal ) ప్రస్తుతం వూల్‌విచ్‌లో నివసిస్తున్నాడు.ఆదివారం హల్‌లో జరిగిన బ్రిటీష్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో( British Chess Championships ) టైటిల్ విన్నర్‌గా నిలిచి ఇంగ్లాండ్ 41వ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు.2007లో డేవిడ్ హోవెల్ 16 ఏళ్ల వయసులో నెలకొల్పిన రికార్డును శ్రేయస్ బద్ధలుకొట్టాడు.ఛాంపియన్‌షిప్‌లో భాగంగా హోవెల్, బ్రిటీష్ తమిళుడైన బోధన శివానందన్‌ను ఓడించి డ్రా చేసుకున్నాడు.

Telugu Britishchess, Londonchess, Shreyas Royal, Shreyasroyal, Youngestbritish-T

2022లో జర్మనీలో జరిగిన ఓపెన్ బవేరియన్ ఛాంపియన్‌షిప్‌ ద్వారా తన మొదటి గ్రాండ్ మాస్టర్ ప్రమాణాన్ని , 2023లో లండన్‌ చెస్ క్లాసిక్‌లో( London Chess Classic ) తన రెండవ ప్రమాణాన్ని శ్రేయస్ సాధించాడు.ఈ ఏడాది జూలైలో గ్రాండ్ మాస్టర్‌కు అవసరమైన 2500 రేటింగ్ మార్కును అధిగమించాడు.ఈ సందర్భంగా శ్రేయస్ మాట్లాడుతూ.యూకేకు అంత గొప్ప చెస్ కల్చర్ లేనందున బ్రిటీష్ గ్రాండ్‌మాస్టర్‌గా మారడం అరుదైన ఫీట్‌గా చెప్పాడు.చెస్‌లో టాప్‌లో ఉన్న భారత్, రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మనం ఇంకా వెనుకబడే ఉన్నామని శ్రేయస్ అన్నాడు.శ్రేయస్ ఇప్పటి వరకు భారత్‌లో ఆడనప్పటికీ.

అతను భారత గ్రాండ్ మాస్టర్ డీ.గుకేష్‌తో తలపడి డ్రా చేసుకున్నాడు.

Telugu Britishchess, Londonchess, Shreyas Royal, Shreyasroyal, Youngestbritish-T

శ్రేయస్ తండ్రి జితేంద్ర సింగ్( Jitendra Singh ) ఢిల్లీకి చెందిన ఓ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్.రాయల్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు టీసీఎస్ నుంచి ఇంట్రా కంపెనీ బదిలీ వీసాపై ఆయన యూకేకి( UK ) వెళ్లారు.2018లో జితేంద్ర సింగ్ ఐదేళ్ల వీసా గడువు ముగియగా, అతని జీతం సైతం పొడిగించే స్థాయిలో లేదు.దీంతో ఆయన ఇంగ్లీష్ చెస్ ఫెడరేషన్‌తో తన ఆందోళనలను లేవనెత్తాడు.

ఈ నేపథ్యంలో అప్పటి యూకే హోం సెక్రటరీ సాజిద్ జావిద్ జోక్యం చేసుకుని .జితేంద్ర సింగ్‌ను టైర్ 2 జనరల్ వీసాపై ఉంచి బ్రిటన్‌లో ఉండేందుకు వీలు కల్పించారు.ఈ క్రమంలో వీరి కుటుంబం బ్రిటీష్ పౌరసత్వం పొందింది.శ్రేయస్ రాయల్ ఐదేళ్ల వయసులో చెస్ ఆడటం ప్రారంభించగా.ఇప్పుడు అతని ఆశయం ఎలో రేటింగ్స్‌ని సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube