ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లలో నందమూరి మోక్షజ్ఞ ( Mokshagna Teja )పేరు కూడా ఒకటి.టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు బాలయ్య బాబు అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.
కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తోంది.కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోస్ ప్రకారం చూసుకుంటే మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా స్టైలిష్ గా గ్లామర్ గా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ.మొత్తానికి మోక్షజ్ఞ వెండితెర అరంగ్రేటం చేయడానికి రెడీ అవుతున్నాడు.డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన తొలి సినిమా చేయబోతున్నాడు.అయితే ఈ సినిమా గతంలో బాలకృష్ణ రాసుకున్న కథతో తెరకెక్కడం లేదు.ప్రశాంత్ వర్మ తన టీమ్ తో కలిసి కూర్చొని, చర్చించి, మధించి రాసుకున్న కథ ఇది.కాకపోతే ఇందులో బాలకృష్ణ చెప్పిన సూచనలు సలహాల్ని కూడా చొప్పించారట.అంతేతప్ప మూడేళ్ల కిందట బాలయ్య( Balakrishna ) రాసుకున్న కథకు మోక్షు మొదటి సినిమాకు ఎలాంటి సంబంధం లేదట.కాకపోతే ఇందులో కూడా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది.

మరో నెల రోజుల్లో ప్రకటన నిజానికి ఈ నెల్లోనే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) సినిమాను ఎనౌన్స్ చేయాలనుకున్నారట.కానీ వచ్చేనెల 6న మోక్షజ్ఞ పుట్టినరోజు ఉంది.ఆ రోజున సినిమాను ప్రకటించాలని భావిస్తున్నారు.ఈ మేరకు ఒక కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.గతంలో హనుమాన్ సినిమాకు ఈ దర్శకుడు క్రియేట్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ పెద్ద హిట్ అయ్యింది.మోక్షజ్ఞ మొదటి సినిమాతో, అతడి సోదరి తేజశ్విని నిర్మాతగా మారుతున్నారు.
ఈ సినిమాకు ఆమె సహనిర్మాతగా వ్యవహరించబోతున్నారట.మొత్తంగా చూసుకుంటే సెప్టెంబర్ 6వ తేదీ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కి సంబంధించి ఏదో ఒక రకమైన వార్త తప్పకుండా తెలుస్తుందని తెలుస్తోంది.