ఉదయం పరిగడుపుతో ఈ నీటిని తాగితే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..?

ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ( tea ) తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది.ప్రస్తుత సమాజంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉదయం నిద్ర లేవగానే టీ తాగని ఇల్లు అస్సలు ఉండదు.

 If You Drink This Water In The Morning Amazing Health Benefits Are Yours , Tea,-TeluguStop.com

కానీ ఖాళీ కడుపుతో టీ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వేధిస్తాయి.

అయితే ప్రస్తుత కాలంలో చాలామంది పాలతో తయారు చేసిన టీ బదులుగా హెర్బల్ టీ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అందులో జీలకర్ర టీ కూడా ముఖ్యమైనది అని నిపుణులు చెబుతున్నారు.

దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.జీలకర్రలో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కె అనే ఎన్నో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

Telugu Cumin Tea, Tips-Telugu Health Tips

ఇవి అనేక వ్యాధులను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.జీలకర్రలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.మీ దినచర్యలో భాగంగా టి నీ తాగడం మొదలు పెడితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.జీలకర్ర టీ ( Cumin tea )నీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఇది అధిక బరువు తగ్గడానికి, జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.మీ అధిక బరువు తగ్గించే క్రమంలో జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ( Fiber )ఉంటుంది.ఇది రక్తంలోని చక్కర ను అదుపు చేస్తుంది.

Telugu Cumin Tea, Tips-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకనికి( gas, indigestion, constipation ) కూడా ఇది ఎంతో మంచిది.దీని వల్ల పొట్ట శుభ్రం అవుతుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.

జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక ఇతర ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.జీలకర్ర నీరు శరీరం నుంచి విష పదార్థాలను దూరం చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.రక్తాన్ని శుద్ధి చేయడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.

ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల అలర్జీలు, చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి.జీలకర్ర నీటిని ఇలా తయారు చేసుకోవాలి.

రెండు చెంచాల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి.తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోసి ఖాళీ కడుపుతో తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube