సాధారణంగా ఒక సినిమాలోని తమ క్యారెక్టర్‌కి తగినట్లు రెడీ కావడానికి హీరోలు చాలా టైమ్ కేటాయిస్తారు.క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా కనిపిస్తుంది, ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటారు.
ఆ తర్వాత దాని తగినట్లు ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించడానికి రామ్ చరణ్( Ram Charan ) ఎంత కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.
ఇక పుష్ప సినిమాలో కూలీ, స్మగ్లర్ గా కనిపించడానికి అల్లు అర్జున్( Allu Arjun ) కూడా చాలా శ్రమ తీసుకున్నాడు.వీరితో పాటు మరో ముగ్గురు హీరోలు తమ సినిమాలోని పాత్రలకు తగినట్లుగా తయారు కావడానికి చాలా నెలలు కష్టపడ్డారు.వాళ్లు ఎవరో, ఆ పాత్ర లేవో తెలుసుకుందాం.
• నాగచైతన్య – తండేల్ – రాజు
వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా( Thandel ) రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులో నాగ చైతన్య( Naga Chaitanya ) రాజు అనే ఓ జాలరి పాత్రలో నటిస్తున్నాడు.అతని లవర్ సత్యగా సాయి పల్లవి యాక్ట్ చేస్తుంది.
అయితే జాలరి పాత్రకు తగినట్లుగా ఉండడానికి నాగచైతన్య ఏకంగా తొమ్మిది నెలల పాటు కష్టపడ్డాడట.అంతేకాదు, ఈ 9 నెలల్లో చిత్తూరు యాస కూడా నేర్చుకున్నట్లు సమాచారం.
• విజయ్ దేవరకొండ – లైగర్ – MMA ఫైటర్
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటించిన “లైగర్” సినిమా( Liger ) ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.కానీ ఈ సినిమాలోని లైగర్ బలరామ్ అగర్వాల్, శాశ్వత్ అగర్వాల్ వంటి డ్యూయల్ రూల్స్ పోషించడానికి విజయ్ చాలానే కష్టపడ్డాడు.ఇందులో ఒక MMA ఫైటర్‌గా విజయ్ కనిపించి మెప్పించాడు.ఈ సినిమాలో అతడి బాడీ ప్రొఫెషనల్ ఫైటర్ లాగానే కనిపిస్తుంది.ఆ బాడీ కోసం విజయ్ ఏకంగా ఒక సంవత్సరం ఆరు నెలలు కష్టపడ్డాడు.అయితే అతని కష్టం మొత్తం వృధా అయిపోయింది.ఈ మూవీ పెట్టిన పెట్టుబడిలో సగం కూడా డబ్బులు వసూలు చేయలేకపోయింది.
• రణ్‌బీర్ కపూర్
ఈ నటుడు రామాయణం సినిమాలో( Ramayanam Movie ) రాముడు క్యారెక్టర్ కు తగినట్లు కనిపించేందుకు ఎనిమిది నెలలు కష్టపడ్డాడు.అలాగే రోజూ తన కాస్ట్యూమ్ ధరించి, తీయడానికి మూడు గంటల సమయం వెచ్చిస్తున్నాడు.ఈ మూవీలో సాయి పల్లవి కూడా నటిస్తోంది.
ఇది హిట్ అయితే భారతదేశ వ్యాప్తంగా వీరిద్దరికీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది.