ఆ క్యారెక్టర్స్ కోసం నెలల తరబడి కష్టపడ్డ సినిమా హీరోలు..??

సాధారణంగా ఒక సినిమాలోని తమ క్యారెక్టర్‌కి తగినట్లు రెడీ కావడానికి హీరోలు చాలా టైమ్‌ కేటాయిస్తారు.

క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా కనిపిస్తుంది, ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటారు.

ఆ తర్వాత దాని తగినట్లు ట్రాన్స్‌ఫార్మ్‌ అవుతారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించడానికి రామ్ చరణ్( Ram Charan ) ఎంత కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

ఇక పుష్ప సినిమాలో కూలీ, స్మగ్లర్ గా కనిపించడానికి అల్లు అర్జున్( Allu Arjun ) కూడా చాలా శ్రమ తీసుకున్నాడు.

వీరితో పాటు మరో ముగ్గురు హీరోలు తమ సినిమాలోని పాత్రలకు తగినట్లుగా తయారు కావడానికి చాలా నెలలు కష్టపడ్డారు.

వాళ్లు ఎవరో, ఆ పాత్ర లేవో తెలుసుకుందాం.h3 Class=subheader-style• నాగచైతన్య - తండేల్‌ - రాజు/h3p """/" / వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్‌ సినిమా( Thandel ) రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో నాగ చైతన్య( Naga Chaitanya ) రాజు అనే ఓ జాలరి పాత్రలో నటిస్తున్నాడు.

అతని లవర్ సత్యగా సాయి పల్లవి యాక్ట్ చేస్తుంది.అయితే జాలరి పాత్రకు తగినట్లుగా ఉండడానికి నాగచైతన్య ఏకంగా తొమ్మిది నెలల పాటు కష్టపడ్డాడట.

అంతేకాదు, ఈ 9 నెలల్లో చిత్తూరు యాస కూడా నేర్చుకున్నట్లు సమాచారం.h3 Class=subheader-style• విజయ్ దేవరకొండ - లైగర్ - MMA ఫైటర్/h3p """/" / రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటించిన "లైగర్" సినిమా( Liger ) ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమాలోని లైగర్ బలరామ్ అగర్వాల్‌, శాశ్వత్ అగర్వాల్‌ వంటి డ్యూయల్ రూల్స్ పోషించడానికి విజయ్ చాలానే కష్టపడ్డాడు.

ఇందులో ఒక MMA ఫైటర్‌గా విజయ్ కనిపించి మెప్పించాడు.ఈ సినిమాలో అతడి బాడీ ప్రొఫెషనల్ ఫైటర్ లాగానే కనిపిస్తుంది.

ఆ బాడీ కోసం విజయ్ ఏకంగా ఒక సంవత్సరం ఆరు నెలలు కష్టపడ్డాడు.

అయితే అతని కష్టం మొత్తం వృధా అయిపోయింది.ఈ మూవీ పెట్టిన పెట్టుబడిలో సగం కూడా డబ్బులు వసూలు చేయలేకపోయింది.

H3 Class=subheader-style• రణ్‌బీర్ కపూర్/h3p """/" / ఈ నటుడు రామాయణం సినిమాలో( Ramayanam Movie ) రాముడు క్యారెక్టర్ కు తగినట్లు కనిపించేందుకు ఎనిమిది నెలలు కష్టపడ్డాడు.

అలాగే రోజూ తన కాస్ట్యూమ్ ధరించి, తీయడానికి మూడు గంటల సమయం వెచ్చిస్తున్నాడు.

ఈ మూవీలో సాయి పల్లవి కూడా నటిస్తోంది.ఇది హిట్ అయితే భారతదేశ వ్యాప్తంగా వీరిద్దరికీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది.

బ్రిటీష్ గ్రాండ్ మాస్టర్‌గా భారత సంతతి బాలుడు.. ఎవరీ శ్రేయస్ రాయల్ ..?