డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి వాల్జ్‌పై రిపబ్లికన్ల విమర్శలు.. నాడు ట్రంప్ చేత ప్రశంసలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేత, ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ఖరారయ్యారు.పార్టీ ప్రతినిధులు ఆమె అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారు.

 Donald Trump Hailed Kamala Harris Vp Pick Tim Walz In 2020 Details, Donald Trump-TeluguStop.com

ఈ క్రమంలోనే తన రన్నింగ్‌మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను( Tim Walz ) ఎంపిక చేసినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.తన వాగ్ధాటి, విషయ పరిజ్ఞానంతో రిపబ్లికన్ పార్టీ విధానాలను ఎండగట్టే వాల్జ్.

డొనాల్డ్ ట్రంప్,( Donald Trump ) ఆ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి జేడీ వాన్స్‌లు చిత్రమైన వ్యక్తులంటూ వ్యాఖ్యానించారు.

దీంతో ట్రంప్ బృందం .కమలా హారిస్ – వాల్జ్‌లను టార్గెట్ చేస్తోంది.2020 మేలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించడంలో వాల్జ్ విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు.మిన్నియాపోలిస్ వీధుల్లో నిరసనలకు , అల్లర్లకు ఆయన అనుమతించాడంటూ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి, ఒహియో సెనేటర్ జేడీ వాన్స్( Ohio Senator JD Vance ) దుయ్యబట్టారు.అయితే ఏబీసీ న్యూస్, సీఎన్ఎన్, పొలిటికో ధృవీకరించిన ఫోన్ రికార్డింగ్ ప్రకారం.

తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గవర్నర్‌ల బృందంతో సంభాషణ సందర్భంగా వాల్జ్ నాయకత్వాన్ని ట్రంప్ ప్రశంసించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telugu Democratic, Donald Trump, George Floyd, Joe Biden, Kamala Harris, Minneap

జార్జ్ ఫ్లాయిడ్ హత్య సమయంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.జూన్ 1, 2020న గవర్నర్లతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.గవర్నర్ వాల్జ్ ఫోన్ లైన్‌లో ఉన్నారని తనకు తెలుసునన్నారు.

గత కొద్దిరోజులుగా ఆయన నిర్వహిస్తున్న విధానంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, వాల్జ్ అద్భుతమైన వ్యక్తని ట్రంప్ వ్యాఖ్యానించారు.ప్రస్తుత పరిస్ధితుల్లో మీరు పెద్ద సంఖ్యలో నేషనల్ గార్డ్‌ని ఉపయోగించాలని ట్రంప్ సూచించారు.

Telugu Democratic, Donald Trump, George Floyd, Joe Biden, Kamala Harris, Minneap

అయితే వాల్జ్.నేషనల్ గార్డ్ సమీరణను ఆలస్యం చేశారని పలువురు విమర్శించారు.అల్లర్లు విస్తరించడానికి అనుమతించారని, 1500పైగా భవనాలకు ఆందోళనకారులు నిప్పంటించి, సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం కలిగించారని మండిపడ్డారు.నేషనల్ గార్డ్‌లో 24 ఏళ్ల పాటు సేవలందించిన వాల్జ్.

చివరికి 7 వేలమంది గార్డ్‌లను మోహరించారు.అయితే మిన్నియాపోలిస్ మేయర్ జాకబ్ ఫ్రే.

సైనిక సహాయాన్ని అభ్యర్ధించిన 18 గంటల తర్వాత వాల్జ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube