సినిమా ఇండస్ట్రీలో ఎంత అందంగా ఉన్నా ఎంత అద్భుతంగా నటించినా సరైన సక్సెస్ లేకపోతే కెరీర్ పరంగా ఇబ్బందులు పడక తప్పదనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం జాన్వీ కపూర్( Janhvi Kapoor ) సైతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.
శ్రీదేవి కూతురిగా సులువుగానే ఆమెకు అవకాశాలు దక్కినా జాన్వీ కపూర్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
జాన్వీ కపూర్ కు ప్రస్తుతం తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.
దేవర సినిమాతో( Devara Movie ) సక్సెస్ అందుకుంటే తెలుగులో జాన్వీ కపూర్ కు తిరుగుండదని చెప్పవచ్చు.చరణ్, నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో సైతం జాన్వీ నటిస్తారని సమాచారం అందుతోంది.
బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీకి సైతం జాన్వీ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.అయితే జాన్వీ ఏ సినిమాకు ఒప్పుకోవాలన్నా అందుకు బోనీ అంగీకారం ముఖ్యమని భోగట్టా.
బోనీ కపూర్( Boney Kapoor ) చెప్పిన రెమ్యునరేషన్ తో సూచించిన సదుపాయాలను కేటాయిస్తామని చెప్పిన నిర్మాతలకు మాత్రమే జాన్వీ డేట్లకు ఓకే చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది.మరోవైపు వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ కు శాపంగా మారాయి.జాన్వీ కపూర్ ను ముంచినా తేల్చినా దేవరనే అని సమాచారం అందుతోంది.తండ్రిపై డిపెండ్ అయ్యి జాన్వీ కపూర్ కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
జాన్వీ కపూర్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.జాన్వీ కపూర్ త్వరలో దేవర మూవీ ప్రమోషన్స్ తో బిజీ అయ్యే అవకాశం అయితే ఉంది.జాన్వీ కపూర్ కు ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తుండగా ఆమె ఇతర భాషల్లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.